Balakrishna Rajinikanth Movie Update: సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన బాలయ్య చాలా తక్కువ సమయంలోనే మాస్ హీరోగా అవతరించాడు. కమర్షియల్ సినిమాలను చేయడంలో బాలయ్య ను మించిన వారు ఎవరు లేరనెంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాంటి బాలయ్య సైతం భారీ కమర్షియల్ సినిమాలను చేయడంలో ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వీళ్ళ కాంబినేషన్లో ఇంతకుముందే ‘వీర సింహారెడ్డి’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా సైతం భారీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉండబోతుంది. అయితే ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ఒక క్యారెక్టర్ లో నటించబోతున్నారనే వార్తలైతే వస్తున్నాయి.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ యూఎస్ఏ రివ్యూ…బొమ్మ హిట్టా..? ఫట్టా..?
రీసెంట్ గా బాలయ్య గోపీచంద్ మలినేని సైతం రజనీకాంత్ ను కలిసి కథనైతే చెప్పారట. రజనీకాంత్ దానికి గ్రీన్ సిగ్నన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో రజినీకాంత్ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్ లో ఉంటుందట. కానీ సినిమా మొత్తానికి ఆ క్యారెక్టర్ హైలెట్ గా నిలుస్తుందని మరి కొంతమంది చెబుతుండటం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా రజినీకాంత్ ‘రోబో’ సినిమా తర్వాత విలన్ గా కనిపించలేదు. మరి ఈ సినిమాలో తను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఏ రేంజ్ లో పోషిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక్కడ ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ డైరెక్షన్లో ‘జైలర్ 2’ సినిమా చేస్తున్నాడు.
అలాగే కమల్ హాసన్ తో కలిసి మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో సైతం రజనీకాంత్ – బాలయ్య బాబు మీద ఉన్న ఇష్టంతో అలాగే బాలయ్య బాబు అంటే తనకు మొదటి నుంచి చాలా మంచి రెస్పెక్ట్ ఉండడంతో అతని సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట…
