https://oktelugu.com/

Credit Card : క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేస్తున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి..

Credit Card : ఇప్పుడున్న కాలంలో ఎవరైనా డబ్బు అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి.

Written By: , Updated On : March 20, 2025 / 08:21 AM IST
Credit Card

Credit Card

Follow us on

Credit Card : ఇప్పుడున్న కాలంలో ఎవరైనా డబ్బు అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. వ్యక్తుల ఆదాయాలతో సంబంధం లేకుండా తక్కువ లిమిట్ తో క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా వివిధ అవసరాలను తీర్చుకోవచ్చు. 40 రోజులకు ముందుగానే క్రెడిట్ కార్డు ద్వారా రకరకాల వస్తువులు కొనుగోలు చేసి.. ఆ తర్వాత డబ్బులు చెల్లించవచ్చు. అయితే ప్రస్తుతం చాలామందికి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల అదనపు భారం అవుతుందని చాలామంది క్రెడిట్ కార్డులను తీసేస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డులను క్లోజ్ చేసే ముందు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి. అవేంటంటే?

Also Read : క్రెడిట్ కార్డులు కావాలా అని కాల్స్ వస్తున్నాయా.. ఎందుకు బ్యాంకు వాళ్లు కాల్స్ చేస్తారంటే?

ఏ క్రెడిట్ కార్డ్ అయితే క్లోజ్ చేస్తున్నారో ఆ కార్డు లిమిట్ ఎంత ఉందో తెలుసుకోండి. ఒకవేళ ఆ కార్డుపై ఎక్కువ లిమిట్ ఉంటే దానిని తీసేయకుండా ఉండండి. ఎందుకంటే ఒక్కోసారి అత్యవసర సమయాల్లో ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎక్కువ లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డ్ చాలా అవసరం ఉంటుంది. అందువల్ల తక్కువ లిమిట్ ఉన్న కార్డును మాత్రమే తీసేయండి.

క్రెడిట్ కార్డుకు క్లోజ్ చేయడం వల్ల సిబిల్ స్కోర్ పై ప్రభావం పడుతుంది. అందువల్ల తప్పనిసరి అయితే తప్ప క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయకుండా ఉండండి. ఒకవేళ సిబిల్ స్కోర్ బాగా ఉంటే అప్పుడు తప్పదు అనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ క్రెడిట్ కార్డ్ ఎక్కువగా వాడకుండా ఉంటే దానిని తీసేసిన ఎటువంటి నష్టం ఉండదు.

తీసేయాలనుకున్న క్రెడిట్ కార్డ్ పై ఎలా వాడారో తెలుసుకోండి. ఒకవేళ 50 శాతం కంటే ఎక్కువగా దీనిని వాడితే దీనిపై రుణాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది ఉన్న ఉపయోగం లేదు. ఒకవేళ 30 శాతం లోపే ఆ క్రెడిట్ కార్డ్ వాడితే.. దానిని తీసేయకుండా ఉండండి. ఎందుకంటే భవిష్యత్తులో దీనిపై అనేక ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది.

కనీసం మూడు క్రెడిట్ కార్డులు ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే కొన్ని సందర్భంలో రెగ్యులర్గా వాడే క్రెడిట్ కార్డులు పనిచేయకపోవచ్చు. ఇలా ఒకటి పని చేయనప్పుడు మరొకటి అన్నట్లు ప్రత్యామ్నాయ క్రెడిట్ కార్డులు ఉండడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా అన్ని క్రెడిట్ కార్డులో పై సక్రమంగా ట్రాన్సాక్షన్ జరిపితే ఎక్కువ మొత్తంలో రుణ సదుపాయం ఉంటుంది. అయితే ఏ క్రెడిట్ కార్డు అయినా గడువులోగా బిల్లు చెల్లించే ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే మొత్తం సిబిల్ స్కోర్ పైన ప్రభావం పడుతుంది. ఒకవేళ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాలని అనుకుంటే.. భవిష్యత్తులో వీటి అవసరం లేదనుకుంటే మాత్రమే ఆ పని చేయాలి. వివిధ అవసరాల కోసం క్రెడిట్ కార్డ్ కావాలనుకునే వారు మాత్రం మినిమం క్రెడిట్ కార్డులు ఉంచుకోవాలని కొందరు నిపుణులు తెలుపుతున్నారు.

Also Read : యూజ్ చేయని క్రెడిట్ కార్డ్స్ ఉండడం మంచిదేనా.. క్లోజ్ చేయడం బెస్టా ?