https://oktelugu.com/

Today horoscope in telugu : ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులకు ఈరోజు మంచి రోజు.. ఎందుకంటే?

Today horoscope in telugu మీన రాశి వారికి సమాజంలో గుర్తింపు వస్తుంది. కొన్ని విషయాల్లో ఇతరులతో విభేదిస్తారు. పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు.

Written By: , Updated On : March 20, 2025 / 08:19 AM IST
Today Horoscope In Telugu (4)

Today Horoscope In Telugu (4)

Follow us on

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొందరు వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు. ఉద్యోగులు అదనపు ప్రయోజనాలు పొందుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితుల ద్వారా ధన సహాయమందుతుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పూర్వికులు ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. అనుకోకుండా విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అదనపు ఉపాధి పొందాలనుకునే వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పనిచేసిన వారికి ఫలితాలు దక్కుతాయి. ఒకరి దగ్గర నుంచి ధన సహాయం తీసుకుంటారు. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరైతే విజయం సాధిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ఆరోగ్యకరమైన పనులు చేయాలి. కొన్ని పనులు అసంపూర్ణంగా మిగిలిపోతాయి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తట్టుకునేందుకు కొన్ని పెట్టుబడులు పెడతారు. స్నేహితులతో పార్టీలు ఉండడం వల్ల అదనంగా డబ్బు ఖర్చు అవుతుంది. అయితే అనవసరపు అప్పులు చేయకుండా ఉండాలి. ఉద్యోగులు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టి బిజీగా ఉంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కర్కాటక రాశి వారికి ఈరోజు ఆనందంగా ఉంటుంది. బంధువుల్లో ఒకరి ప్రవర్తన పై ఆందోళన కలుగుతుంది. అయితే మాటల తీరుతో ఎదుటివారిని ఆకట్టుకోవచ్చు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. తల్లిదండ్రుల సలహా మేరకు కొత్త పెట్టుబడులు పెడతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎదుటి వ్యక్తిలో మార్పులు తీసుకురావడానికి కష్టపడతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులు కొత్త ఆఫర్లు పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. బందుల సహాయంతో కొత్త పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థుల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలి. సాయంత్రం ఇంట్లో కుటుంబంతో కలిసి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనుకోకుండా విహారయాత్రలకు వెళ్తారు. బ్యాంకు నుంచి రుణాన్ని సులభంగా పొందుతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవాలి. పిల్లల చదువు విషయంలో శుభవార్తను వింటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులు కొన్ని సవాలను ఎదుర్కొంటారు. అయినా లక్ష్యాలను పూర్తి చేయడంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు పిల్లలనుంచి నిరాశ వార్తలు వింటారు. కుటుంబంలో కొన్ని బాధ్యతలు చేపడతారు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు ముఖ్యమైన పనులు చేయడంలో బిజీగా ఉంటారు. చట్టపరమైన చిక్కులు ఉంటే అందులో విజయం సాధిస్తారు. ఇంట్లో ఒకరి వివాహానికి అడ్డంకులు ఏర్పడితే నీటితో సమసిపోతాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి వైవాహిక జీవితం బాగుంటుంది. ఎటువంటి గొడవలు జరిగినా మౌనంగా ఉండడమే మంచిది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. కొత్త ఒప్పందాలు చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం మార్గాలు ఏర్పరచుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. సాయంత్రం పిల్లలతో కాలక్షేపం చేస్తారు. వాదనలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామిపై కోపాన్ని తగ్గించుకోవాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి గట్ల గల్లా మంచిగా అనుకో గల్ల కు

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు ఉపాధ్యాయుల మద్దతు ఉంటుంది. దీంతో పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కొన్ని మాటలు కారణంగా కుటుంబ సభ్యుల మధ్య ఉధృత వాతావరణం తలెత్తవచ్చు. వ్యాపారులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోవాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. పూర్ణికుల ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. కొత్త వ్యాపార ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. భవిష్యత్తులో ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు అందుతాయి. సాయంత్రం ఫ్రీగాతో ఉల్లాసంగా ఉంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : మీన రాశి వారికి సమాజంలో గుర్తింపు వస్తుంది. కొన్ని విషయాల్లో ఇతరులతో విభేదిస్తారు. పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది. సమాజంలో గుర్తింపు వస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది.