Smita Sabharwal
Smita Sabharwal : కెసిఆర్ హయంలో నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఓ అధికారి కూతురు వివాహానికి ఓ నిర్మాణ సంస్థ కోట్లు ఖర్చుపెట్టింది. ఫలక్ నామా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వివాహం జరిపించింది. ఆ నిర్మాణ సంస్థ గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణలో ఎటువంటి పనులు చేపట్టిందో అందరికీ తెలుసు. ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోనూ ఆ నిర్మాణ సంస్థ కే పనులు మొత్తం దక్కుతున్నాయి. ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పెద్దలతో అంట కాగడం.. అలయ్ బలయ్ చేసుకోవడం గడచిన పది సంవత్సరాలలో విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వ పెద్దలు కూడా తమకు నచ్చిన అధికారులకు ఒకటికి మించి పోస్టింగులు ఇవ్వడం.. అవి కూడా కీలక శాఖల్లో ఉండడం.. నచ్చని వారిని దూరం పెట్టడం.. వంటివి పరిపాటిగా మారాయి. అమోయ్ కుమార్, స్మితా సబర్వాల్, నవీన్ మిట్టల్, జయేష్ రంజన్… ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలానే ఉంది. అయితే వీరిలో అమోయ్ కుమార్ ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Also Read : బ్యూరోక్రాట్లకు సోయి ఉండాలి.. అది అదుపు తప్పితే ఇదిగో స్మితా సబర్వాల్ లాగే మాట్లాడుతుంటారు.
ఇప్పుడు స్మిత సబర్వాల్ వంతు..
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్మిత సబర్వాల్ సీఎంవో కార్యదర్శిగా పనిచేసేవారు. మిషన్ భగీరథ పనులు కూడా పర్యవేక్షించేవారు. ఒకరకంగా చెప్పాలంటే నెక్స్ట్ టు కెసిఆర్ అన్నట్టుగా ఉన్నారు ఆమె. అప్పట్లో ఆమెపై ఓ మ్యాగజైన్ కార్టూన్ వేసినప్పుడు.. పరువు నష్టం దావా కేసు వేశారు. ఆ కేసుకు సంబంధించి విచారణ ఖర్చును కూడా ప్రభుత్వం భరించింది. దానిపై అప్పట్లో ఆరోపణలు నిర్మించాయి. అయినప్పటికీ ప్రభుత్వం దానిని సమర్థించుకోవడం విశేషం. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్మితా సబర్వాల్ కు ప్రాధాన్యం పూర్తిగా తగ్గించారు.. అనామక పోస్టును ఆమెకు కేటాయించారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత స్మిత సబర్వాల్ వార్తల్లో వ్యక్తి అయ్యారు.. హైదరాబాదులోని ప్రభుత్వ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి మిట్ట సబర్వాల్ నోటీసులు అందుకున్నారు.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం ఓ కార్యదర్శిగా పనిచేసిన ఆమె ఇన్నోవా కారును అద్దెకి తీసుకున్నారు. 2016 నుంచి 2024 అంటే దాదాపు 9 నెలల కాలం వరకు ఆ కారుకు ప్రభుత్వం ప్రతినెల అద్దె చెల్లించింది. నెలకు 63 వేల చొప్పున రెంటు చెల్లించింది. జయశంకర్ యూనివర్సిటీలో ఇటీవల ఆడిట్ నిర్వహించగా ఈ విషయం వెలుగు చూసింది.. దీనిపై యూనివర్సిటీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాహనం ఆర్థిక సంబంధించిన డబ్బులు చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.. స్మిత సబర్వాల్ అద్దెకు తీసుకున్న 08 EC 6345 వాహనం నాన్ టాక్స్ కాదు. ఎల్లో ప్లేట్ వాహనం అంతకంటే కాదు.. అది పూర్తిగా వ్యక్తిగత వాహనం. ఆ వాహనం పవన్ కుమార్ అనే వ్యక్తి పేరు మీద ఉంది.. స్మితా సబర్వాల్ కార్యాలయం నుంచి ప్రతినెల వాహనం అద్దెకు సంబంధించి రసీదులు రావడంతో యూనివర్సిటీ అధికారులు డబ్బులు చెల్లించారు.. అయితే యూనివర్సిటీలో ఆడిట్ నిర్వహించగా అనేక అవకతవకలు వెలుగు చూసాయి. ఇవి నిజమేనని వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ అల్తాస్ జానయ్య పేర్కొన్నారు. దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. స్మితా సబర్వాల్ పై ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పీకల దాకా కోపం ఉంది.. ఇప్పుడు అవకాశం అంది వచ్చింది. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? లేకుంటే ప్రాప్త కాలజ్ఞతను ప్రదర్శిస్తారా అనేది చూడాల్సి ఉంది.
Also Read : కొండపోచమ్మ సాగర్ దగ్గర స్మితా సబర్వాల్.. ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?