Dhurandhar 2 Actors Remuneration: కాసేపటి క్రితమే మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీ ‘ధురంధర్ 2 – ది రివెంజ్'(Dhurandhar 2 – The Revenge) కి సంబంధించిన ప్రీమియర్ షోస్ ఇండియా వైడ్ గా మొదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూస్ తో కాసేపట్లో సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లబోతుంది. కొంతమంది బాలీవుడ్ క్రిటిక్స్ అయితే ఈ సినిమాకు అప్పుడే 4 స్టార్ రేటింగ్స్ కూడా ఇచ్చేసారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఈ చిత్రం లో నటించే నటీనటులు ఎంతెంత రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా హీరో రణవీర్ సింగ్ గురించి మాట్లాడుకోవాలి. మొదటి భాగం కి ఈయన తీసుకున్న రెమ్యూనరేషన్ కేవలం 40 కోట్ల రూపాయిలు మాత్రమే. కానీ రెండవ భాగానికి అంతకు రెండింతల రెమ్యూనరేషన్ , అనగా 80 కోట్ల రూపాయలకు పైగా అందుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: 17 ఏళ్లు దాటింది.. రాజస్థాన్ ఈసారైనా రాజసాన్ని చూపుతుందా? బలాలేంటి?బలహీనతలేంటి?
రెండవ భాగం హిట్ అయినా , ఫ్లాప్ అయినా బాక్స్ ఆఫీస్ వద్ద కచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ ని కేవలం మొదటి వారం లోనే రాబడుతుంది కాబట్టి, ఆ మాత్రం తీసుకోవడం లో తప్పు లేదని అంటున్నారు నెటిజెన్స్. ఇక ఈ చిత్రం లో విలన్ గా నటించిన అర్జున్ రామ్ పాల్ 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట. మాములుగా ఈయన రెమ్యూనరేషన్ 5 కోట్ల రూపాయిల లోపే , కానీ క్రేజీ సీక్వెల్ లో నటిస్తుండడం వల్ల రెమ్యూనరేషన్ మూడింతలు అందుకున్నాడు. ఇక ఈ చిత్రం లో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసిన సంజయ్ దత్ ఏకంగా 25 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నట్టు తెలుస్తోంది. మొదటి భాగానికి ఆయన తీసుకున్నది కేవలం 15 కోట్ల రూపాయిలు మాత్రమే , ఇప్పుడు పది కోట్లు పెంచాడు.
ఇక ఇందులో హీరోయిన్ గా నయించిన సరా అర్జున్ మొదటి భాగానికి కేవలం 3 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే అందుకుంది. కానీ ఈ చిత్రానికి ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ , అంటే మూడింతలు కంటే ఎక్కువ అన్నమాట. ఇలా ఈ చిత్రం లోని నటీనటులంతా ఈ స్థాయి రెమ్యూనరేషన్స్ ని అందుకున్నారు. మొదటి భాగానికి, రెండవ భాగానికి ఎంత తేడా ఉందో మీరే చూడండి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి, భారీ లాభాలను రాబడితే మాత్రం , అందులో కచ్చితంగా హీరో రణవీర్ సింగ్ ki వాటా ఉంటుందని అంటున్నారు. అంటే ఈ చిత్రం 3000 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడితే , ఆయన వాటా ఎంత ఉంటుందో మీరే ఊహించుకోండి.
