మే లోనే కరోనా తగ్గుదల

కరోనా రోజురోజుకు పెరుగుతున్నా ఓ తీపి కబురు ఊరిస్తోంది. దేశంలో రోజుకు కరోనా కేసుల సంఖ్య 4 లక్షలు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మే నెలలో తగ్గుముఖం పడుతుందని ప్రముఖ శాస్ర్తవేత్త గగన్ దీప్ చెప్పడంతో అందరు ఆసక్తిగా ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యాక కేసుల సంఖ్య లక్షల్లో నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని అధ్యయనాలు మాత్రం కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పినా గగన్ దీప్ మాత్రం తగ్గుతుందని ప్రకటించడంపై పలువురు […]

Written By: Srinivas, Updated On : May 8, 2021 5:47 pm
Follow us on

కరోనా రోజురోజుకు పెరుగుతున్నా ఓ తీపి కబురు ఊరిస్తోంది. దేశంలో రోజుకు కరోనా కేసుల సంఖ్య 4 లక్షలు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మే నెలలో తగ్గుముఖం పడుతుందని ప్రముఖ శాస్ర్తవేత్త గగన్ దీప్ చెప్పడంతో అందరు ఆసక్తిగా ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యాక కేసుల సంఖ్య లక్షల్లో నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని అధ్యయనాలు మాత్రం కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పినా గగన్ దీప్ మాత్రం తగ్గుతుందని ప్రకటించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేసినా వైరస్ తగ్గుదల అనేది ఆహ్వానించదగ్గ విషయమే. అధికారిక లెక్కల ప్రకారం కేసుల సంఖ్య రోజుకు 4 లక్షలు దాటుతున్నా అనధికారికంగా 5 లక్షలు చేరుకుంటుందని అంచనా.
భయాందోళనలో ప్రజలు
కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించినా కేసుల సంఖ్య పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ప్రభుత్వాల చర్యలపై విమర్శలు పెరిగాయి. కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రోజురోజుకు కేసులు పెరుగుతూ ప్రజ్లల్లో భయం పుట్టిస్తున్నాయి.
దడ పుట్టిస్తున్న సర్వేలు
రోజుకో రకంగా సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీంతో సామన్యుడు ఆందోళన చెందుతున్నాడు. ఏదో జరుగుతుందని బాధ పడుతూ తమ ప్రాణాలు కోల్పోతున్నాడు. కరోనా వైద్యం సైతం సక్రమంగా అందక ప్రాణాలు విడిచిన సందర్భాలు సైతం ఉన్నాయి. సరైన వసతులు లేక, వైద్యం అందక ఎంతో మంది బలవుతున్నారు. ఆక్సిజన్, పడకల కొరతతో జనం అల్లాడుతున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. చికిత్స మాత్రం ఆ స్థాయిలో అందడం లేదు. ఫలితంగా ప్రజల ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి నెలకొంది.
సామాన్యులే సమిధలు
కరోనా మహమ్మారి ధాటికి సామాన్యులే సమిధలవుతున్నారు.  వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటేనే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని తెలిసినా పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు తమ ప్రాణాలే పణంగా పెట్టాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాల్లో చలనం లేకుండా పోతోంది. మొదటి వేవ్ లో చూపించిన ఉత్సాహం సెకండ్ వేవ్ లో ఎందుకు చూపించడం లేదని ప్రశ్నిస్తున్నారు.