ప్రముఖ హీరోలందరూ రాజకీయాలంటే మక్కువ చూపిస్తుంటారు. ప్రజా సేవ చేయాలంటే పార్టీ యే ప్రధాన మని భావిస్తుంటారు. ఇందులో భాగంగానే రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజలకు దగ్గరవుతారు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి వారు ముఖ్యమంత్రులుగా కొనసాగారు. సినిమాలకు, రాజకీయాలకు దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే రెండు రంగాల్లో రాణించాలని తలచే వారే ఎక్కువగా ఉంటారు. గతంలో చిరంజీవి సైతం ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాలకు వెళ్లినా సక్సెస్ కాలేకపోయారు. అదే కోవలో పవన్ కల్యాణ్ సైతం జనసేన పార్టీ పెట్టినా ఆయనా విజయం సాధించలేకపోయారు. అదే కోవలో తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ పార్టీలు స్థాపించినా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాల్గొని కమల్ హాసన్ చేయి కాల్చుకున్నారు. ఆయన పోటీ చేసిన స్థానంలో సైతం ఓటమి పాలయ్యారు. రజనీకాంత్ మాత్రం అనారోగ్యం కారణంగా పోటీకి దూరంగా ఉన్నారు.
సేవ చేయాలంటే రాజకీయాలేనా?
ప్రజా సేవ చేయాలంటే రాజకీయాలేనా? సొంతంగా చేయలేమా అంటే చేయొచ్చని నిరూపించారు. ప్రముఖ నటుడు సోనూసూద్ ఎలాంటి రాజకీయాలు లేకుండానే స్వచ్ఛందంగా సాయం చేస్తూ తనలోని దాతృత్వాన్ని చాటుతున్నాడు. దీంతో ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది. ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు సినిమాల కంటే సమాజంలో ఎక్కువ గర్తింపు రావడం గమనార్హం.
సినిమాల్లోనే హీరోయిజం
సినిమాల్లో కథానాయకుడు పలు రంగాల్లో తన హీరోయిజాన్ని చూపిస్తుంటాడు. నిజ జీవితంలో మాత్రం అలా కుదరదు. దీంతో సినిమాల్లో డూప్ ల సహాయంతో సాహస కృత్యాలు చేస్తూ అలరిస్తారు. వాస్తవానికి వాటిని చేసేది మరొకరు. హీరో తన వారిని రక్షించే క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు పడుతుంటాడు. వాస్తవంగా వాటిని ఆధారంగా తమ జీవన విధానంపై ప్రభావం చూపిస్తుంటాయి. హీరోయిజమే ప్రధానంగా సాగే ఇతివృత్తంతో సినిమాల నిర్మాణం జరుగుతుంటుంది.
పేదవారికి చేయూతగా
సినిమాల్లో రాణించే వారు బయట ప్రపంచంలో పేదవారికి తమకు తోచిన సాయం చేస్తుంటారు. మహేశ్ బాబు సినిమాలో ఓ ఊరిని దత్తత తీసుకుని ఆ ఊరి బాగు కోసం అహర్నిషలు శ్రమిస్తుంటాడు. అది చూసిన కొందరు స్ఫూర్తిగా తీసుకుని కొన్ని ఊర్లను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేసి మరీ నిరూపించారు. దీంతో సినిమాల ప్రభావం కూడా వాస్తవంగా ఉంటుందని చెప్పవచ్చు.