కరోనా కల్లోలానికి ఆయువుగా ‘కుంభమేళా’

గతేడాది దేశంలో కరోనా ఎలా విజృంభించిందో అందరం చూశాం. కలలలోనూ ఊహించని విధంగా అందరినీ భయపెట్టింది. కరోనా అని పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తారు. అయితే.. ఆ ఏడాది కరోనా దేశంలోకి ఎంటర్‌‌ కావడానికి ప్రధాన కారణం మర్కజ్‌ అని అందరికీ తెలిసిందే.   సామూహికgగా ముస్లింలు ప్రార్థనలు చేయడం.. విదేశాల నుంచి కరోనా అంటిపెట్టుకొని వచ్చిన వారితో కలవడంతో దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. అక్కడి వైరస్‌ సోకి.. ఇక్కడ సంచరించడం వల్లే వైరస్‌ వ్యాప్తికి […]

Written By: Srinivas, Updated On : April 17, 2021 10:51 am
Follow us on

గతేడాది దేశంలో కరోనా ఎలా విజృంభించిందో అందరం చూశాం. కలలలోనూ ఊహించని విధంగా అందరినీ భయపెట్టింది. కరోనా అని పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తారు. అయితే.. ఆ ఏడాది కరోనా దేశంలోకి ఎంటర్‌‌ కావడానికి ప్రధాన కారణం మర్కజ్‌ అని అందరికీ తెలిసిందే.   సామూహికgగా ముస్లింలు ప్రార్థనలు చేయడం.. విదేశాల నుంచి కరోనా అంటిపెట్టుకొని వచ్చిన వారితో కలవడంతో దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. అక్కడి వైరస్‌ సోకి.. ఇక్కడ సంచరించడం వల్లే వైరస్‌ వ్యాప్తికి అడ్డు లేకుండా పోయింది. ఆ తర్వాత మర్కజ్‌పై ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు పెట్టింది.

ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ కూడా అందరినీ ఠారెత్తిస్తోంది. జెట్‌ స్పీడ్‌లా దూసుకొస్తున్న కరోనాను అడ్డుకోవడం ప్రభుత్వాల వల్ల కూడా కావడం లేదు. అటు వ్యాక్సినేషన్‌ నడుస్తున్నా.. ఇటు కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు సరికదా.. పెరుగుతూనే ఉన్నాయి. రోజుకు లక్షలాది పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

అయితే.. ఇప్పుడు కుంభమేళాతోనూ ఈ వైరస్‌ ఉధృతి భారీగానే పెరుగుతున్నట్లుగా అర్థమవుతోంది. మర్కజ్‌తో పోలిస్టే కుంభమేళాకు వచ్చే జనం భారీగా ఉంటుంది. మొదటి రోజే 30 లక్షల మంది అక్కడ గంగ స్నానాలు చేశారు. ఇంకా లక్షలాది మంది కుంభమేళాకు వెళ్తూనే ఉన్నారు. కానీ.. అక్కడికి వెళ్లవద్దని.. అక్కడికి వెళ్తే కరోనా వ్యాప్తి చెందుతుందని ఎవరూ ప్రచారం చేయడం లేదు. ఎవరూ కుంభమేళాను అడ్డుకోవడం లేదు. దీంతో అక్కడ ఇప్పుడు పెద్ద ఎత్తున పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి.

నిన్న ఒక్క రోజే పదుల సంఖ్యలో నాగ సాధువులు కరోనా బారిన పడ్డారు. ఇక సామాన్య భక్తుల గురించి చెప్పే పరిస్థితి లేదు. కోవిడ్‌ నెగెటివ్‌ వచ్చిన వారే వారణాసికి రావాలని అక్కడి ప్రభుత్వం చెబుతున్నా.. ఎవరూ దానిని పట్టించుకున్న దాఖలలు కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈసారి మర్కజ్‌ కన్నా దారుణంగా కుంభమేళా నడుస్తోంది. మరోపక్క మర్కజ్‌ను వేలెత్తి చూపుతూ వార్తలు ప్రసారం చేసిన మీడియా కూడా.. ఇప్పుడు ఎందుకో కుంభమేళా మీద దృష్టి పెట్టడం లేదు. కరోనాకు హిందువుల పండుగ.. ముస్లింల పండుగ అనే తేడా లేదు. అన్ని మతాల వారిని అది బలితీసుకుంటూనే ఉంది. ఈ క్రమంలో అందరం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.