https://oktelugu.com/

ఫార్ములా పాతది.. గ్లామర్ డోస్ మాత్రం డబుల్ !

దర్శకుడు శ్రీను వైట్ల పరిస్థితి మరి దారుణంగా తయారైందనే చెప్పాలి. ప్లాప్ లతో ఇమేజ్ పోయి.. చివరకు సినిమా సెట్ చేసుకోవడానికి కిందామీదా పడుతూ.. లాంగ్ గ్యాప్ తర్వాత మంచు విష్ణుతో శ్రీనువైట్ల “డిడి (డబుల్ డోస్)” అనే మూవీని సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ కామెడీ డైరెక్టర్ చేస్తున్న సినిమాలన్నీ వరుసగా భారీ పరాజయాలు రావడంతో ప్రస్తుతం శ్రీను వైట్ల సినిమాలకు అసలు మార్కెట్ లేదు. ఇలాంటి టైంలో […]

Written By:
  • admin
  • , Updated On : April 17, 2021 / 10:31 AM IST
    Follow us on

    దర్శకుడు శ్రీను వైట్ల పరిస్థితి మరి దారుణంగా తయారైందనే చెప్పాలి. ప్లాప్ లతో ఇమేజ్ పోయి.. చివరకు సినిమా సెట్ చేసుకోవడానికి కిందామీదా పడుతూ.. లాంగ్ గ్యాప్ తర్వాత మంచు విష్ణుతో శ్రీనువైట్ల “డిడి (డబుల్ డోస్)” అనే మూవీని సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ కామెడీ డైరెక్టర్ చేస్తున్న సినిమాలన్నీ వరుసగా భారీ పరాజయాలు రావడంతో ప్రస్తుతం శ్రీను వైట్ల సినిమాలకు అసలు మార్కెట్ లేదు. ఇలాంటి టైంలో తనకు భారీ సక్సెస్ తెచ్చిపెట్టిన ‘ఢీ’ సినిమాకు సీక్వెల్ చేస్తూ మళ్ళీ అదే రొటీన్ ఫార్ములాను నమ్ముకున్నాడు శ్రీను వైట్ల.

    అప్పట్లో సంచలన విజయం అందుకున్న ఢీ సినిమా.. ‘విలన్ ను బపూన్ చేసి హీరో ఆడుకోవడం అన్న ఫార్ములా’తో పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. అప్పడు ఈ ఫార్ములా జనాలకు బాగా నచ్చింది. పైగా ఇప్పటికి ఆ సినిమా టీవీల్లో వస్తే.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు జనం. పైగా అదే ఫార్ములాతో రెడీ, కింగ్ లాంటి సినిమాలు తీసి హిట్ కొట్టాడు శ్రీను వైట్ల. అయితే ఆ తరువాత అదే ఫార్ములాతో శ్రీను వైట్ల చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోగా .. ప్లాప్ చిత్రాలుగా నిలిచాయి. మరి మళ్ళీ ఇప్పుడు శ్రీను వైట్ల ఏ నమ్మకంతో అదే ఫార్ములాతో సినిమా చేస్తున్నాడో చూడాలి.

    తన స్టామినా ప్రూవ్ చేసుకునేందుకు ఇప్పుడు డీ సీక్వెల్ చేస్తున్నా అని ఈ కామెడీ డైరెక్టర్ చెప్పుకుంటున్నా.. తన పై ఉన్న ప్లాప్ ల ఇమేజ్ పోగొట్టుకోగలడా ? ఇక ఈ మూవీలో అను ఎమ్మాన్యుయేల్, ప్రగ్యా జైశ్వాల్ ను హీరోయిన్లుగా తీసుకున్నారు. ‘ఢీఢీ’ అంటే డబల్ డోస్ వినోదం అనుకున్నాం.. కానీ గ్లామర్ డోస్ కూడా రెండింతలు ఉండబోతుందట ఈ సినిమాలో. అను, ప్రగ్య ఇద్దరూ అందాలు ఆరబోయటంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోరు. దర్శకుడు కోరాలే గాని బికినీ షోలతో యూత్ కి మంచి కమర్షియల్ హంగులు చూపిస్తారు. దీనికి తోడు కామెడీకి గ్లామర్ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించడంలో దర్శకుడు శ్రీను వైట్లది ప్రత్యేక శైలి. మరి ఈ కలయికలో హిట్ వస్తోందేమో.