
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో మొదట పోస్టల్ బ్యాలెట్ లు లెక్కిస్తున్నారు.
-నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ దూకుడు
సాగర్ ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రెండు రౌండ్లలోనూ టీఆర్ఎస్ లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 2665 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్ లో టీఆర్ ఎస్ కు 3421, కాంగ్రెస్ కు2882 ఓట్లు వచ్చాయి.
-తిరుపతిలో వైసీపీ ముందంజ
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ముందంజలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ సందర్భంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గ కౌంటింగ్ 14 రౌండ్ల సూళ్లుారుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌండ్లు జరగనుంది.
-బెంగాల్ లో మమత లీడ్
బెంగాల్ లో బీజేపీ వర్సెస్ టీఎంసీ హోరాహోరీ నడుస్తోంది. తమిళనాడులో డీఎంకే స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగుతోంది. ఇక పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి లీడ్ లో ఉంది. కాంగ్రెస్ బాగానే సీట్లను సాధిస్తోంది. కేరళలో అధికార ఎల్డీఎఫ్ కూటమికి కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనిస్తోంది. అసోంలో బీజేపీ లీడ్ లో కొనసాగుతోంది. ఉదయం 9.30 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ 84 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇక బీజేపీ 55 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కమ్యూనిస్టు పార్టీల కూటమి కేవలం 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
-తమిళనాడులో డీఎంకే హవా
తమిళనాట డీఎంకే హవా కొనసాగుతోంది. డీఎంకే పార్టీ 23 స్థానాల్లో లీడ్ లో ఉండగా.. అన్నాడీఎంకే 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కమల్ హాసన్ పార్టీ ఇంకా ఖాతా తెరవలేదు.
-కేరళలో కమ్యూనిస్టు కూటమిదే లీడ్
కేరళలో ఎల్డీఎఫ్ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 1 స్థానంలో ముందంజలో ఉంది.
-అస్సాంలో బీజేపీనే
అసోం రాష్ట్రంలో బీజేపీ 28 స్థానాల్లో లీడ్ లో ఉండగా.. కాంగ్రెస్ 12, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
-పుదుచ్చేరిలో బీజేపీ లీడ్
ఇకపుదుచ్చేరిలోనూ బీజేపీ కూటమి 5 స్థానాల్లో లీడ్ లో ఉంది. డీఎంకే కూటమి 4 స్తానాల్లో లీడ్ లో ఉంది. ఇక్కడ హోరా హోరీ కనిపిస్తోంది.