https://oktelugu.com/

బీజేపీ వరం: ఎన్డీయే అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌

ఏదేని రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయంటే అక్కడి పార్టీలు తాయిలాలు ప్రకటించడం సర్వసాధారణం.ఇప్పుడు బిహార్‌‌ రాష్ట్రానికి ఎన్నికలు వచ్చాయి. అక్టోబర్‌‌ 28 నుంచి మూడు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. దీంతో పార్టీలు తమ ఇష్టం వచ్చినట్లుగా హామీలు ఇస్తూనే ఉన్నాయి. ప్రజలను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నాయి. Also Read:బాలుడు దీక్షిత్ కిడ్నాప్‌ కథ విషాదాంతం ఇందులో భాగంగా.. తమ పార్టీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలను ఇస్తామని ఆర్జేడీ ప్రకటించింది. దీనికి దీటుగా బీజేపీ మరిన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 / 02:13 PM IST
    Follow us on

    ఏదేని రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయంటే అక్కడి పార్టీలు తాయిలాలు ప్రకటించడం సర్వసాధారణం.ఇప్పుడు బిహార్‌‌ రాష్ట్రానికి ఎన్నికలు వచ్చాయి. అక్టోబర్‌‌ 28 నుంచి మూడు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. దీంతో పార్టీలు తమ ఇష్టం వచ్చినట్లుగా హామీలు ఇస్తూనే ఉన్నాయి. ప్రజలను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నాయి.

    Also Read:బాలుడు దీక్షిత్ కిడ్నాప్‌ కథ విషాదాంతం

    ఇందులో భాగంగా.. తమ పార్టీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలను ఇస్తామని ఆర్జేడీ ప్రకటించింది. దీనికి దీటుగా బీజేపీ మరిన్ని హామీలను గుప్పించింది. ఎన్డీయే కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంది. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్‌ని రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వేయిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్తిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్‌ చేశారు.

    ఎన్డీయే హయాంలోనే 15 ఏళ్లలో బిహార్‌‌లో జీడీపీ 3 నుంచి 11.3 శాతానికి పెరిగిందన్నారు. ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఇతర పార్టీలు ఇస్తున్న మోసపూరిత హామీలను నమ్మకుండా ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలన్నారు. వచ్చే ఐదేళ్ల పాటు నితీశ్‌కుమార్‌‌ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.

    మేనిఫెస్టోలో భాగంగా బీజేపీ ఇచ్చిన హామీలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో 3 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, బిహార్‌‌ను ఐటీ హబ్‌గా తయారు చేసి 1‌‌0 లక్షల మందికి ఉపాధి కల్పించడం.. 3 కోట్ల మంది మహిళలకు స్వయం ఉపాధి.. ఆరోగ్య రంగంలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించడం. 30 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లు.. 9వ తరగతి నుంచి ప్రతీ విద్యార్థికి ట్యాబ్లెట్‌ అందించనున్నారు.

    Also Read: ఉల్లిగడ్డ భారం: తెలుగు రాష్ట్రాల ‘ఉల్లి’ కన్నీరు

    ఇలా అలివికానీ హామీలతో బీహార్ ఓటర్లను ఆకర్షించడానికి బీజేపీ వరాల మూట విప్పింది. ఇక ఆర్జేడీ-కాంగ్రెస్ కూడా భారీగానే వరాలు ఇచ్చింది. దీంతో ఈ బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది వేచిచూడాలి.