https://oktelugu.com/

ఆగిన మహేష్ ‘సర్కారు వారి పాట’.. ఆందోళనలో డైరెక్టర్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. ఈ మూవీలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటించనుందని చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. మహేష్ బాబు సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘సర్కారువారిపాట’లోకి ఆహ్వానించిన సంగతి తెల్సిందే..! Also Read: రాజమౌళి మళ్లీ లేట్.. ఎన్టీఆర్ చెప్పినట్టే జరిగిందిగా..! సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ‘సర్కారువారిపాట’ సినిమా ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. కథ రీత్య […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 / 01:28 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. ఈ మూవీలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటించనుందని చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. మహేష్ బాబు సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘సర్కారువారిపాట’లోకి ఆహ్వానించిన సంగతి తెల్సిందే..!

    Also Read: రాజమౌళి మళ్లీ లేట్.. ఎన్టీఆర్ చెప్పినట్టే జరిగిందిగా..!

    సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ‘సర్కారువారిపాట’ సినిమా ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. కథ రీత్య ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది. దీంతో దర్శకుడు పర్శురాం గతంలోనే అమెరికాలోని కొన్ని లోకేషన్లను ఎంపిక చేశాడు.

    మహేష్ బాబు ఇటీవల ఈ మూవీ షూటింగ్ కోసం 45రోజుల కాల్షీట్స్ ఇచ్చాడు. దీంతో చిత్రబృందం అమెరికాలో షూటింగ్ చేసేందుకు సన్నహాలు చేసింది. అయితే చిత్రబృందంలోని సభ్యులకు వీసాల సమస్య వచ్చింది. దీంతో ఈ మూవీ షూటింగు మరో రెండు నెలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే మహేష్ దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడనే టాక్ విన్పిస్తోంది.

    ఇటీవల ‘ఖలేజా’ మూవీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ బాబు దర్శకుడు త్రివికమ్ తో కలిసి పని చేయాలని ఉందని ట్వీట్ చేశాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో త్వరలోనే ఓ మూవీ రానుందని స్పష్టమైంది. ప్రస్తుతం ‘సర్కారువారిపాట’ ఆలస్యం అవుతుండటంతో మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీని లైన్లో పెడుతున్నాడు. దీంతో దర్శకుడు పర్శురాం టెన్షన్ పడుతున్నాడు.

    దర్శకుడు పర్శురాం నాగచైతన్యతో ఓ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తుండగానే మహేష్ మూవీ ఆఫర్ దక్కింది. తీరా సినిమా పట్టాలెక్కించే సమయానికి వీసాల్లో తలెత్తిన సమస్య కారణంగా ‘సర్కారువారిపాట’ షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో మహేష్ వేరే దర్శకుడి వేటలో పడటంతో పర్శురాంలో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం చైతూ కూడా పలు సినిమాల్లో నటిస్తూ బీజీగా మారాడు.

    Also Read: బాలయ్య వర్సెస్ మెగాస్టార్.. ఫ్యాన్స్ లొల్లి షూరు..!

    దీంతో మహేష్ తనకు హ్యండిస్తే ఎంటి పరిస్థితి అని పర్శురాం దిగాలు చెందుతున్నాడట. ఈనేపథ్యంలోనే సినిమాను ఎలాగైనా పట్టాలెక్కించాలని ‘సర్కారువారిపాట’ చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈమేరకు ఇండియాలోనే షూటింగ్ చేయాలని భావిస్తున్నారట. అన్ని కుదిరితే నవంబర్ తొలివారంలోనే మూవీ పట్టాలెక్కనుందని టాక్ విన్పిస్తోంది. ఈసారైనా పర్శురాం ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో వేచిచూడాల్సిందే..!