కరోనా కొత్త స్ట్రెయిన్.. డేత్ రేట్ పై తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు..!

కరోనా వైరస్.. కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. భారత్ లోనూ కరోనా కొత్త కేసులు నమోదువుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఆరు కొత్త కేసులు నమోదైనట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. Also Read: ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..! కరోనా కొత్త స్ట్రెయిన్ డెత్ రేట్ పై తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కొత్త వైరస్ […]

Written By: Neelambaram, Updated On : December 29, 2020 8:06 pm
Follow us on

కరోనా వైరస్.. కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. భారత్ లోనూ కరోనా కొత్త కేసులు నమోదువుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఆరు కొత్త కేసులు నమోదైనట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

Also Read: ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..!

కరోనా కొత్త స్ట్రెయిన్ డెత్ రేట్ పై తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కొత్త వైరస్ కు వేగంగా వ్యాపించే లక్షణం ఉన్నప్పటికీ ప్రాణాంతకం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కరోనా కొత్త వైరస్ పై కేంద్రం అధ్యయనం చేస్తుందని తెలిపారు. ప్రజలు కరోనా కొత్త వైరస్ పట్ల భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. మాస్కులు ధరించం.. భౌతిక దూరం పాటించడం.. చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి కరోనా నిబంధనలు అందరూ పాటించాలని సూచించారు.

Also Read: కొత్త పీసీసీ చీఫ్ కు సరికొత్త సవాళ్లు.. రెడీగా ఉన్నాయా..?

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని ఆయన స్పష్టం చేశారు. ఫస్ట్ వేవ్‌కు సంబంధించిన కేసులు.. మరణాలు కూడా చాలావరకు తగ్గుముఖం పట్టినట్లు ఆయన తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు.

చలికాలంలో వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉండటంతో ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. న్యూ ఇయర్ వేడుకల్లోనూ ప్రజలు జాగ్రత్త ఉండాలని ఈటల రాజేందర్ హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్