గ్రేట్ జర్నలిస్ట్ అర్నాబ్ మళ్లీ జైలుకేనా?

దేశంలోనే గ్రేట్ భీకర జర్నలిస్టుగా రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి పేరుంది. బీజేపీ అనుకూల రాజకీయం చేసే ఈయన రోజు రాత్రి చర్చలు పెడుతూ రాజకీయ నాయకులను ఉచ్చ పోయిస్తుంటాడని పేరు తెచ్చుకున్నాడు. నీతి, నిజాయితీకి నాలుగో సింహంలా బయటకు కనిపిస్తాడు. అయితే తెరవెనుక బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడి ఇటీవలే జైలు పాలయ్యాడు. Also Read: ‘తలైవా’ వెనక్కి.. ‘దళపతి’ ముందుకు..! ముంబై పోలీసులు అప్పట్లో రిపబ్లిక్ టీఆర్పీ స్కాంను బయటపెట్టి డబ్బులకు తన చానెల్ […]

Written By: NARESH, Updated On : December 29, 2020 8:09 pm
Follow us on

దేశంలోనే గ్రేట్ భీకర జర్నలిస్టుగా రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి పేరుంది. బీజేపీ అనుకూల రాజకీయం చేసే ఈయన రోజు రాత్రి చర్చలు పెడుతూ రాజకీయ నాయకులను ఉచ్చ పోయిస్తుంటాడని పేరు తెచ్చుకున్నాడు. నీతి, నిజాయితీకి నాలుగో సింహంలా బయటకు కనిపిస్తాడు. అయితే తెరవెనుక బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడి ఇటీవలే జైలు పాలయ్యాడు.

Also Read: ‘తలైవా’ వెనక్కి.. ‘దళపతి’ ముందుకు..!

ముంబై పోలీసులు అప్పట్లో రిపబ్లిక్ టీఆర్పీ స్కాంను బయటపెట్టి డబ్బులకు తన చానెల్ ను చూసేలా కొన్ని యంత్రాలు పెట్టించి రిపబ్లిక్ టీవీ యాజమాన్యం, అర్నాబ్ చేసిన మాయాజాలం గుట్టును విప్పారు. ఇక మరోకేసులోనూ అర్నాబ్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ఇప్పుడా టీఆర్పీ స్కాం తాజాగా అర్నాబ్ గోస్వామి మెడకు చుట్టుకుంది. తాజాగా బార్క్ మాజీ సీఈవో పార్ట్ దాస్ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ తన చానెల్ ను ప్రమోట్ చేసేందుకు లక్షల్లో లంచం ఇవ్వడంతోపాటు మరో ఖరీదైన వాచ్ కూడా ఇచ్చారని పార్ధ్ దాస్ గుప్తా చెప్పినట్టు సమాచారం.అర్నాబ్ గోస్వామి ఇచ్చిన డబ్బులతోనే ఈ మూడు కిలోల వెండిని కొనుగోలు చేసినట్లు పార్ద్ దాస్ గుప్తా చెప్పినట్లు సమాచారం.

Also Read: బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్.. అరగంటలో తక్కువ వడ్డీతో రుణం తీసుకునే ఛాన్స్..?

దీంతో ఇన్నాళ్లుగా దేశంలో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలన్నీ ఈ ఆరోపణలతో మట్టి కొట్టుకుపోయాయి. అందరూ ఇన్ స్పిరేషన్ గా తీసుకున్న అర్నాబ్ ఇలాంటి వ్యవహారాలు నడిపాడని.. టీఆర్పీ కోసం వక్రమార్గాలు తొక్కాడని బయటపడడం జర్నలిస్ట్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదంతా శివసేన సర్కార్ చేస్తున్న కుట్ర అనేవారు కూడా లేకపోలేదు. పోలీసుల విచారణ ముగిస్తే కానీ అర్నాబ్ భవితవ్యం తేలేలా లేదు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్