హాట్ యాంకర్ శ్రీముఖికి కోపం వచ్చింది. హీరోయిన్ రేంజ్ గ్లామర్ తనలో ఉంటే.. తనను కేవలం హాట్ బ్యూటీగానే చూస్తున్నారు అని అమ్మడు తెగ ఇదైపోతుంది. ఎంత అందచందాలు ఉన్నా కెరీర్లో ఎప్పుడో ఒకసారి డల్ ఫేజ్ చూడాల్సిందే అని సన్నిహితులు వివరణ ఇస్తున్నా.. శ్రీముఖి విరుచుకుపడుతుందట. తనకు టీవీ షోలలో అవకాశాలు ఉన్నప్పటికీ సినిమాల్లో మాత్రం చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవని.. ఒకటి రెండు సినిమాలు చేస్తున్నా.. అవన్నీ ఐటమ్ క్యారెక్టర్లు అని, అందుకే నాకు ఇండస్ట్రీ మీద ఇంట్రస్ట్ పోతుందని శ్రీముఖి కన్నీళ్లు పెట్టుకుంటుందట. ఇక నుండైనా తను మూవీస్ లో కూడా బిజీ కావాలని తెగ ఆరాట పడుతుందట.
Also Read: ఐటమ్ సాంగ్‌తో హీటెక్కిస్తున్న మోనాల్
ఏది ఏమైనా శ్రీముఖి బాధలో అర్ధం ఉంది. వెండితెరైనా బుల్లితెరైనా శ్రీముఖి తనకున్న గ్లామర్ ను ఒళ్ళు దాచుకోకుండా బాగానే ప్రదర్శన చేస్తోంది. పైగా కామెడీ కూడా బాగా చేయగలదు. పైగా తనలో హీరోయిన్ మెటీరియల్ కూడా ఉంది, అటు ఐటమ్ సాంగ్స్ కి పెర్ఫెక్ట్ ఫిగర్ తనకు ఉంది. అన్నిటికి మించి వయసు కూడా తక్కువే. ఇన్నీ ఉన్నా.. తను మాత్రం కేవలం యాంకర్ గానే మిగిలిపోయాను అనే బాధ ఆమెలో ఉందట. ఇంత బాధలో కూడా ఈ అమ్ముడు మాత్రం తన అందాల ప్రదర్శనను తాను ప్రదర్శిస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కుర్రకారును రెచ్చగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకుంటూ ఆ రకంగా బాగానే ముందుకుపోతుంది అనుకోండి, అది వేరే విషయం.
Also Read: 2020 ఓటిటి హిట్స్: సాలిడ్ సౌండ్ తో పేలిన చిన్న చిత్రాలు!
తను ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండటానికి తరచుగా హాట్ ఫోటో షూట్లు చేస్తూ అన్ని విధాలుగా అందర్నీ ఆకట్టుకుంటుంది శ్రీముఖి. అయినప్పటికీ ఆల్ టైం బ్యూటీ అనసూయ భారీ అందాల ముందు శ్రీముఖి పెద్దగా క్లిక్ అవ్వట్లేదు. శ్రీముఖి కోసం సినిమాల్లో క్యారెక్టర్ లు రాసేవారు కూడా ఎవ్వరూ లేరు. ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ చిన్న చితకా సినిమాలే. ఆ అసహనం రోజురోజుకు పెరుగుతుందట. అసలు సినిమా వాళ్ళు తనని వాడుకోవట్లేదని తెగ ఫీల్ అవుతుందట.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్