Cool Drinks
Cool Drinks : వేసవికాలం రాగానే కాస్తా చల్లబడాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎండలోకి వెళ్లేవారు ఏదైనా ద్రవాన్ని తీసుకోవాలని అనుకుంటారు. అయితే సాధారణ నీరు తాగడం కంటే కూల్ డ్రింక్ తీసుకోవాలని కోరుకుంటారు. కూల్ డ్రింక్స్ చాలా చల్లగా ఉండి మైండ్ ను రిఫ్రెష్ చేస్తాయి. అంతేకాకుండా కూల్ డ్రింక్ తీసుకోవడం వల్ల కొందరు ఏదో తెలియని కొత్త అనుభూతిని పొందుతారు. అయితే కూలింగ్ తాగడం వల్ల ఎన్నో రకాల నష్టాలే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఇనిస్ట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్లోని కొందరు శాస్త్రవేత్తలు కూల్ డ్రింక్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయో తీసి చెప్పారు. వారి వివరాల ప్రకారం ఏంటంటే?
Also Read : చెప్పిన వినకుండా కూల్ డ్రింక్స్ తాగుతున్నారుగా.. అవి తాగడం వల్ల 3.4లక్షల మంది చనిపోయారట ?
కూల్ డ్రింకులో అనేక రసాయనాలను కలుపుతూ ఉంటారు. వీటితో ఆరోగ్యం పై ప్రభావం పడుతుందని అంటున్నారు. అయితే కూల్ డ్రింక్ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో తెలుసుకోవడానికి పరిశోధన అవసరవేత్తలు ఒక ప్రయోగం చేశారు. ముందుగా ఈ కూల్డ్రింకుతో ఎలుకలపై పరిశోధనలు చేశారు. దీంతో ఇందులో అధిక శాతం సుక్రోజ్ ఉన్నట్టు తేలింది. ఈ సుక్రోస్ వల్ల మధుమేహం త్వరగా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఇది శరీరంలోకి అధిక మోతాదు వెళ్లడం వల్ల ఊభకాయం కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అంతేకాకుండా కూల్ డ్రింక్ లోని రసాయనాల వల్ల జీర్ణ క్రియ దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.
అయితే సరదా కోసం కొందరు.. ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఇంకొందరు.. కూల్ డ్రింక్స్ ను తెస్తూ ఉంటారు. ఇలా అప్పుడప్పుడు తాగిన శరీరంలోకి చక్కర శాతం ఎక్కువగా వెళుతుంది. దీంతో చిన్న వయసులోని మధుమేహం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నేటి కాలంలో చాలామంది ఈ వ్యాధులు బారిన పడుతున్నారు. అయితే కూల్ డ్రింక్స్ బదులు.. కొబ్బరి బొండం లేదా నీటి కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమమని అంటున్నారు. అంతేకాకుండా కూల్ డ్రింక్స్ కు ప్రత్యామ్నాయంగా ఇతర పానీయాలను ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇది వారిలో ఎక్కువగా చక్కెర శాతాన్ని తీసుకువెళ్లి భవిష్యత్తులో ఆందోళన కరణమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా వీటికి అలవాటు పడినవారు పదేపదే లేనిదే ఉండలేరు. వీటికి బాధలు సాంప్రదాయ జ్యూసులు తీసుకునే అలవాటు చేయాలి. అంతేకాకుండా ఇంట్లోనే కొన్ని రకాల పళ్ళతో జ్యూస్ ను ఎలా తీసుకోవాలో నేర్పించాలి. వీటిని తీసుకోవడం వల్ల ఎనర్జీతో పాటు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
ఈమధ్య కూల్ డ్రింక్స్ తో పాటు ఎనర్జీ ఫ్రెండ్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీటనీ తీసుకోవడం వల్ల తక్షణం శక్తి వస్తుంది. కానీ ఆ తర్వాత కాలంలో నరాలపై ప్రభావం పడుతుంది. అందువల్ల సాధ్యమైనంతవరకు కూల్ డ్రింకుకు దూరంగా ఉండి సాంప్రదాయ జ్యూసులు తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read : కూల్ డ్రింక్స్‌తో ఎన్ని నష్టాలో తెలుసా..?