https://oktelugu.com/

Cool Drinks: కూల్‌ డ్రింక్స్‌తో ఎన్ని నష్టాలో తెలుసా..?

రెగ్యులర్‌గా కూల్‌ డ్రింక్స్‌ తాగడం వలన మన మెదడు సైజు తగ్గిపోతుందట. మెమోరీ కూడా లాస్‌ అవుతుందట. ఈ విషయాన్ని బోస్టన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ రీసెర్చ్‌ వాళ్లు ధ్రువీకరించారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : January 24, 2024 / 05:45 PM IST
    Follow us on

    Cool Drinks: కూల్‌ డ్రింక్స్‌.. షాపుల్లో చూడగానే తాగాలనిపించే పానీయం. తాగుతున్నప్పుడు చల్లగా కడుపులోకి పోతుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. కానీ, దాంతో ఎన్నో అనారోగ్యాలు మనకు వచ్చే ప్రమాదం ఉన్నట్లు పరిశోధనల్లో నిర్దారణ అయింది. కూల్‌ డ్రింక్స్‌తో ప్రమాదమనే విషయాన్ని ఇప్పటికే చాలా మంది గ్రహించారు. కానీ, తరచుగా తాగుతూనే ఉన్నారు. రెగ్యులర్‌గా కూల్‌డ్రింక్స్‌ తాగడం వలన కలిగే నష్టాలు ఎంటో తెలుసుకుందాం.

    – రెగ్యులర్‌గా కూల్‌ డ్రింక్స్‌ తాగడం వలన మన మెదడు సైజు తగ్గిపోతుందట. మెమోరీ కూడా లాస్‌ అవుతుందట. ఈ విషయాన్ని బోస్టన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ రీసెర్చ్‌ వాళ్లు ధ్రువీకరించారు.

    – ఫ్రామింగమచ్‌ హార్ట్‌ స్టడీ వారు రోజూ కూల్‌ డ్రింక్‌ తాగేవారి శాంపిల్లను తీసుకుని నాలుగు వేళ మందిపై పరిశోధన చేశారు. వారానికి మూడుసార్లు సోడా, కూల్‌ డ్రింక్స్‌ తాగే వారి మెదడును ఎంఆర్‌ఐ ద్వారా స్కాన్‌ చేసి పరిశీలించారు. అందులో వారి మెదడు పరిమాణం తగ్గినట్లు ధ్రువీకరించారు.

    – మెమొరీ లాస్‌ కూడా అవుతుందని ఈ పరిశోధనలో తేలిందజి హిప్పోకమస్‌ పరిమాణం కూడా తగ్గడం గమనించారు. దీంతో గుర్తుంచుకునే సామర్థ్యం కూడా తగ్గుతుందని వెల్లడించారు.

    – దంపతుల్లో రోజూ కూల్‌డ్రింక్‌ తాగేవారు ఉంటే గర్భం దాల్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని తేల్చారు. భర్త లేదా భార్యలో ఎవరో ఒకరు తాగినా ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించారు.

    – వయసు పైబడినవారు ఎక్కువగా కూల్‌ డ్రింక్స్‌ తాగితే అల్జీమర్స్, హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

    – చిన్న పిల్లలకు కూల్‌ డ్రింక్స్‌ తాగించడం వలన వారి మెదడు ఎదుగుదల లోపిస్తుందని గుర్తించారు. మెదడు ఎదుగుదల దశలో కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా తాగిస్తే బద్ధిమాంద్యం వస్తుందని పేర్కొంటున్నారు.