PM Modi
PM Modi: అమెరికా అధ్యక్షుడిగా డనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎన్నికయ్యారు. జనవరి 20న బాధ్యతలు చేపట్టారు. ఇక భారత ప్రధానిగా మోదీ మూడోసారి ఎన్నికయ్యారు. 3.0 పాలనలో మొదటిసారి మోదీ అమెరికా(America) వెళ్లారు. ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. అంతకు ముందు ఫ్రాన్స్‌కు వెళ్లారు. 10 నుంచి 12 వరకు ప్యారిస్‌లో ఏఐ యాక్షన్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మక్రాన్‌తో భేటీ అయ్యారు. ఇక అమెరికా పర్యటన సందర్భంగా కూడా పలు అంశాలు చర్చించనున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్(Most wanted Criminals)ను కూడా భారత్‌కు అప్పగించే విశయం కూడా చర్చకు రానుంది. వాణిజ్యం పెట్టుబడులు, టెక్నాలజీ, డిజిటల్, రక్షణ రంగంలో పరస్పర సహకారం, ఉగ్రవాదం అణచివేత, కౌంటర్ టెర్రరిజం, ఇండో పసిఫిక్ సెక్యూరిటీ వంటి అంశాలపై ట్రంప్–మోదీ చర్చిస్తారని సమాచారం. ఈ సందర్భంగా కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం కూడా ఉంది.
ఉగ్ర కుట్ర..
ఇదిలా ఉంటే.. మోదీ ప్రయాణిస్తున్న విమానంపై దాడికి ఉగ్రవాదులు కఉట్ర చేశారని తెలిసింది. ప్రధాని ఎయిర్ క్రాఫ్ట్‌పై దాడిచేస్తారని పక్కా సమాచారం ఉందని ముంబై పోలీస్ కంట్రోల్ రూం(fMumbai Police Control Room)కు ఫోన్ చేశాడు. సెకన్ల వ్యవధిలో ఈ ఫోన్‌కాల్ కట్ అయింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ముంబై పోలీసులు మ్యాన్ హంట్ మొదలు పెట్టారు. అందుబాటులో ఉన్న సాంకేతికత సహాయంతో ఫోన్‌కాల్ చేసిన అజ్ఞాత వ్యక్తిని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ముంబై కమిషనర్ ధ్రువీకరించారు. మంగళవారం చెంబూర్ నుంచి ఫోన్ చేశాడని వెల్లడించారు. అతని మానసిక స్థితి సరిగా లేదని విచారణలో తేలిందని పేర్కొన్నారు.
పటిష్ట భద్రత..
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల సమయంలో సెక్యూరిటీ చర్యలు అత్యంత కఠినంగా ఉంటాయి. ఆయన సెక్యూరిటీ ఏర్పాట్లు భారతీయ నలుగురు ప్రధాన భద్రతా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. వాటిలో ఎస్‌పీజీ(SPG) (స్పెషల్ ప్రోటెక్షన్ గ్రూప్), ఐబీ(IB) (ఇంటెలిజెన్స్ బ్యూరో), ఆర్‌ఏడబ్ల్యూ(RAW) (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ విభాగం), పోలీస్ విభాగాలు ప్రధానంగా ఉన్నాయి. ప్రధాని విదేశాలకు వెళ్లినప్పుడు, అక్కడి స్థానిక భద్రతా బృందాలతో సమన్వయం కాగలదు. ఇతర దేశాలలో, భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం, లైవ్ ట్రాకింగ్(Line Traking). ఎలక్ట్రానిక్ పరికరాలు ద్వారా ఆయన భద్రత పర్యవేక్షణ చేయబడుతుంది. ప్రధాని మోదీకి ప్రత్యేకమైన రక్షణ కోసం ఎస్‌పీజీ బృందం అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక శిక్షణ పొందిన సైనికులు, పోలీసు అధికారులతో కూడి మోదీకి 24/7 రక్షణ అందిస్తారు. ఇక ఆయన ప్రయాణించే విమానాలు అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను పాటిస్తాయి, మరియు విమానంలో కూడా ప్రత్యేక భద్రతా ప్రొటోకాల్ ఉంటుంది. ప్రయాణం మొదలయ్యే ముందు, ముఖ్యమైన భద్రతా పథాలు, ప్రదేశాలు, ట్రాన్స్‌పోర్ట్ మార్గాలు ముందుగానే చర్చించి, పర్యవేక్షణ వందల కొద్ది సార్లు నిర్వహించబడుతుంది. మోదీ పర్యటన చేసే ప్రాంతంలో గస్తీల ద్వారా దాడుల నివారణ కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి చోట భద్రతా స్కానింగ్, డిటెక్టర్లు, ఇతర ఆధునిక పరికరాల ద్వారా పరిశీలన కొనసాగుతుంటుంది. ప్రధాని మోదీకి ఈ భద్రతా చర్యలు కఠినంగా ఉండటమే కాకుండా, అతనితో పాటు దేశంలో జరిగిన ఏఓ కీలకమైన రాజకీయ, ఆర్థిక అంశం పట్ల అతని భద్రతా వ్యవస్థ నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది.