Students Collecting pocket money
Viral Video : స్నేహానికి మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. తల్లిదండ్రులు, తోడ పుట్టిన వాళ్లు.. బంధువులు మనల్ని ప్రేమిస్తారు. మనం కష్టాల్లో ఉండే ఆదుకుంటారు. మన కన్నీళ్లను తుడిచేస్తారు. ఎందుకంటే వాళ్లతో రక్తసంబంధం ఉంటుంది కాబట్టి.. ఆ పని చేస్తుంటారు.. ఎటువంటి రక్తసంబంధం లేకుండా.. నిస్వార్ధంగా ఎదుటి మనిషి ఆనందాన్ని, సంతోషాన్ని కోరుకునేది స్నేహం మాత్రమే. అందువల్లే స్నేహానికంటే మించింది లోకానలేదనే నానుడి పుట్టింది. కాలం మారుతున్నా కొద్దీ స్నేహం కూడా రకరకాలుగా మారుతున్నది. అయితే అక్కడక్కడ స్వచ్ఛమైన స్నేహం ఇంకా ఫరిడవిల్లుతూనే ఉంది. అలాంటి సంఘటనే నేపాల్ దేశంలో జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియా అత్యంత శక్తివంతంగా ఉండడంతో.. ఈ విషయం వెలుగు చూసింది..
పాకెట్ మనీ నుంచి చెల్లించారు
నేపాల్ దేశంలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఓ విద్యార్థికి చదువుతున్నాడు. అతడి తండ్రి ఆర్థిక పరిస్థితి గతంలో బాగుండేది. అయితే ఇటీవల అతని పరిస్థితి దారుణంగా మారింది. ఈ క్రమంలో తన కుమారుడి స్కూల్ ఫీజు చెల్లించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. నేపాల్ దేశంలో త్వరలో వార్షిక పరీక్షలు జరగనున్నాయి. అయితే స్కూల్ ఫీజు చెల్లిస్తేనే వార్షిక పరీక్షలు రాయడానికి ఆ విద్యార్థికి అనుమతి ఇస్తామని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఫీజు చెల్లించే మార్గం లేకపోవడంతో ఆ విద్యార్థి తండ్రి చేతులెత్తేశాడు.. దీంతో ఆ విద్యార్థి కన్నీటి పర్యంతమయ్యాడు. తోటి స్నేహితుడు అంతటి బాధలో ఉండి ఇబ్బంది పడుతుంటే.. చూస్తూ తట్టుకోలేక.. ఇతర స్నేహితులు ఒక నిర్ణయం తీసుకున్నారు. తమ వద్ద ఉన్న పాకెట్ మనీ ని వసూలు చేశారు. ఆ తర్వాత ఆ డబ్బును తీసుకెళ్లి పాఠశాల మేనేజ్మెంట్ కు ఫీజుగా చెల్లించారు. తనకోసం.. తన స్నేహితులు అంతలా ప్రేమ చూపించడాన్ని.. ఆ విద్యార్థి తట్టుకోలేకపోయాడు. స్కూల్ ఫీజు చెల్లించిన వెంటనే కన్నీటి పర్యంతమయ్యాడు. తన స్నేహితులను పట్టుకొని బోరున విలపించాడు. ఈ వీడియోను ఆ స్కూల్లో పని చేస్తే ఓ టీచర్ తన ఫోన్లో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. స్నేహానికంటే మించింది ఏదీ లేదని.. దానిని ఈ విద్యార్థులు నిరూపించారు. కష్ట కాలంలో స్నేహితుడికి తోడుగా ఉన్నారు. చిన్న వయసులోనే వారు తమ పరిపక్వతను చూపించారు. తమ స్నేహాన్ని ఈ విద్యార్థులు పదికాలాలపాటు కాపాడుకోవాలని.. మిగతా వారికి ఆదర్శవంతంగా నిలవాలని.. జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అతడు కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారగా.. లక్షలాది వ్యూస్ సొంతం చేసుకోవడం గమనార్హం.
కష్టాల్లో ఉన్న స్నేహితుడికి.. మిగతా స్నేహితులు అండగా నిలిచారు. తమ స్నేహితుడికి.. తమ వద్ద ఉన్న పాకెట్ మనీ వసూలు చేసి ఫీజు చెల్లించారు. నేపాల్ దేశంలో ఈ సంఘటన జరిగింది.. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. #Nepal#schoolfee#Students #Friendship pic.twitter.com/GfjRwU5Ihv
— Anabothula Bhaskar (@AnabothulaB) February 12, 2025