Homeబిజినెస్Apple : మార్కెట్లోకి కొత్త ఆపిల్ పవర్‌బీట్స్ ప్రో 2 ఇయర్‌బడ్స్.. ఫీచర్స్ తెలిస్తే...

Apple : మార్కెట్లోకి కొత్త ఆపిల్ పవర్‌బీట్స్ ప్రో 2 ఇయర్‌బడ్స్.. ఫీచర్స్ తెలిస్తే పిచ్చెక్కాల్సిందే

Apple : ప్రఖ్యాత ఆపిల్ కంపెనీ (Apple) తన బీట్‌ బ్రాండ్ ఆధ్వర్యంలో Powerbeats Pro 2 ఇయర్‌బడ్స్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టబోతుంది. రేపు అంటే ఫిబ్రవరి 13న 249డాలర్లు(మన కరెన్సీలో రూ.21,600 ) ధరతో మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతుంది. ఈ కొత్త ఇయర్‌బడ్స్ అనే అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉండడంతో కస్టమర్లు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. దీనిలో ఇంటర్నల్ గా హర్ట్ బీట్ ను టెస్ట్ చేసే సెన్సార్లు ఉన్నాయి. బ్యాటరీ జీవితం, Apple AirPods లైన్లో కనిపించే అనేక అప్‌గ్రేడ్లతో ఈ కొత్త మోడల్ రాబోతుంది. Powerbeats Pro 2లో అత్యంత ప్రత్యేకమైన ఫీచర్‌ అంటే హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్లను కలిగి ఉండడం.

ఈ ఇయర్‌బడ్స్ వినియోగదారులు వ్యాయామం చేస్తున్న సమయంలో పలు ఫిట్నెస్ యాప్స్, వంటివి ఉపయోగించి తమ హార్ట్ రేట్‌ను ట్రాక్ చేయగలుగుతారు. దీని ద్వారా ఆపిల్ వాచ్ ధరించకుండానే హార్ట్ రేట్‌ను తెలుసుకోవచ్చు. అయితే, ఈ హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్ ప్రారంభంలో Apple Fitness+ యాప్‌తో సెట్‌ అయ్యే అవకాశం లేదు. కానీ Apple Health యాప్ ద్వారా హార్ట్ రేట్‌ను చూడవచ్చు. Powerbeats Pro 2లో ఫిజికల్ టచ్ కంట్రోల్స్, యాక్టివ్ నాయిస్ క్యాన్సలింగ్, ట్రాన్స్పారెన్సీ లిసనింగ్ మోడ్‌లు కూడా ఉంటాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సలింగ్, పక్కన ఉన్న శబ్దాలను నిరోధించి, స్పష్టమైన ఆడియో అనుభవాన్ని యూజర్లకు అందిస్తుంది. ట్రాన్స్పారెన్సీ మోడ్ కింద, వినగలిగే శబ్దాల వాల్యూమ్ పెంచి వినియోగదారులకు చుట్టుపక్కల పరిసరాల డిస్టర్బెన్స్ వినిపించకుండా చేస్తుంది.

Powerbeats Pro 2 10 గంటల బ్యాటరీ జీవితం అందిస్తుంది, అందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సలింగ్ ఆఫ్ చేయడంతో ఇంకా 45 గంటల వరకు సగటు ఛార్జింగ్ కేసుతో ప్లేబ్యాక్ సమయం ఉంటుంది. ఇయర్‌బడ్స్ వాటర్ రెసిస్టెంట్ గా ఉండి, గత మోడళ్లతో పోలిస్తే 20శాతం లైటర్ డిజైన్‌తో వస్తున్నాయి. Apple Beats బ్రాండ్‌ను తీసుకునే ఈ ఇయర్‌బడ్స్, Android ఫోన్లతో కూడా బాగా పని చేస్తాయి. కానీ, iPhone యూజర్స్‌కు పర్సనలైజ్డ్ స్పేషియల్ ఆడియో, Siri సహాయంతో లాజికల్ ఎక్స్‌పీరియన్స్ వంటి ప్రత్యేకతలు అందుబాటులో ఉంటాయి. ఈ Powerbeats Pro 2 ఇయర్‌బడ్స్ హార్ట్ రేట్ మానిటరింగ్‌తో Apple మరొక ప్రయాణానికి పునాది వేస్తుంది. ఇది వినియోగదారుల ఆరోగ్య ట్రాకింగ్ వ్యవస్థలో మరో సంచలనాన్ని నమోదు చేయనుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version