Congress: 70 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ డీలా పడిపోతోంది. అంతర్గత కుమ్ములాటలతో బిజీగా ఉంది. గత 7 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. అటు కేంద్రంలో అధికారం కోల్పొవడం, రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోవడం వంటి పరిణామాలు కాంగ్రెస్ క్యాడర్‌ను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. అయినా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలమైన క్యాడర్ ఉంది. కానీ పార్టీలోనే జరిగే రాజకీయాల వల్ల అది అధికారంలోకి రావడం లేదు. ఇలాగే జరిగితే పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కాంగ్రెస్ కు తగ్గని అభిమానం.. కానీ..
ప్రతీ పల్లెల్లో ఇప్పటికీ కాంగ్రెస్ అంటే అభిమానం తగ్గలేదు. కానీ ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడంలో పార్టీ నాయకులు విఫలమవుతున్నారు. ఇప్పటికీ ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తు కనిపిస్తే ఓటు వేసి వచ్చే ఓటర్లు చాలా మంది ఉన్నారు. అంతగా ప్రజల్లో అభిమానం సంపాదించుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ అవే పాత పద్దతులు, పాత ఆలోచనల వల్ల ప్రజల అభిమానాన్ని కోల్పోతున్నది.
హుజూరాబాద్ ఓటమిపై చెరో మాట..
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల మనసులో గుర్తింపు ఉంది. కానీ నాయకుల అసమర్థత వల్ల అవి ఓట్లుగా మారలేకపోతున్నాయి. తెలంగాణ వచ్చాక 23 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, రెండో సారి జరిగిన ఎన్నికల్లో ఆ సంఖ్యను 19కు తగ్గించుకుంది. దీంతో క్యాడల్ డీలా పడిపోయింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక కొంత మార్పు కనిపించింది. నాగర్జున సాగర్, దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించిన కాంగ్రెస్.. హుజూరాబాద్ లో మాత్రం టీఆర్ఎస్ ఓటమికి, బీజేపీ గెలుపునకు కృషి చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్‌లో బీజేపీకి భారీ విజయం సాధించిపెట్టడంలో కాంగ్రెస్ హస్తం ఉందనే వాదన వినిపిస్తోంది. దీనికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. ఎన్నికల ఫలితాల పై టీపీసీసీ చీఫ్ కంటే ముందే ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్‌ను నిలవరించేందుకు పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. గట్టిగా పోరాడితే అది ఎక్కడ ఈటల ఓటమికి కారణం అవుతుందోనని, లైట్ తీసుకున్నామని అన్నారు. ఈ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టినట్టు అయ్యాయి. ఈ విషయం పార్టీ హైకమాండ్ కు తెలిస్తే రేవంత్‌కు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది.
ఆయనను ఇరికించడానికే కోమటి రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
Also Read: Telangana: త్వరలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుందా?
కోమటి రెడ్డి వ్యాఖ్యలపై పొన్నం స్పందన..
కోమటి రెడ్డి వ్యాఖ్యలపై పొన్న ప్రభాకర్ స్పందించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అన్నారు. అనంతరం జగ్గారెడ్డి కూడా రేవంత్ రెడ్డిపై అంసతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇలా కాంగ్రెస్‌లో లొల్లి కొనసాగుతూనే ఉంది. అందరూ ఒకే తాటిపై నిలబడటం లేదు. ఎవరికివారు స్వతంత్రంగా స్పందిస్తున్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారు. ఇలా చేస్తే పార్టీ ఉనికికే ప్రమాదం. ఇక పార్టీ రాజకీయాలనే సెట్ చేసుకోలేకపోతే.. ప్రజల్లో నిలబడి ఓట్లు అడగడం కూడా కష్టమవుతుంది. ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. ఇంకా ఇదే తీరు కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా పార్టీ బలంగా పోటీ చేయలేదు. అంతిమంగా ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుంది. ఇప్పటికైనా అందరూ సర్దుకుపోయి ఒకే మాట మీద నిలబడాల్సిన అవసరం ఉంది.
Also Read: Diwali: దీపావళి ఒక్కరోజు పండగకాదు.. ఈ తరానికి తెలియని రహస్యం