విద్యార్థులకు కండోమ్స్: పాఠశాలలు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

నిండా 12 ఏళ్లు కూడా నిండని విద్యార్థులు.. దాదాపు 5వ తరగతి నుంచే పిల్లలకు కండోమ్స్ అందుబాటులో ఉంచేస్తారట.. ఎందుకంటే.. సెక్స్ ఎడ్యూకేషన్ కోసమట.. విద్యార్థులు శృంగారం చేసుకుంటే లైంగిక వ్యాధులు, అవాంచిత గర్భాలు రాకుండానట.. చిన్నపిల్లలను కూడా సెక్స్ అడిక్ట్ చేసేలా అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్ ఎడ్యూకేషన్ (సీపీఎస్) బోర్డు తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపింది. 5వ , ఆ తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో కండోమ్ లు అందుబాటులో ఉండే విధంగా బోర్డు […]

Written By: NARESH, Updated On : July 13, 2021 4:24 pm
Follow us on

నిండా 12 ఏళ్లు కూడా నిండని విద్యార్థులు.. దాదాపు 5వ తరగతి నుంచే పిల్లలకు కండోమ్స్ అందుబాటులో ఉంచేస్తారట.. ఎందుకంటే.. సెక్స్ ఎడ్యూకేషన్ కోసమట.. విద్యార్థులు శృంగారం చేసుకుంటే లైంగిక వ్యాధులు, అవాంచిత గర్భాలు రాకుండానట.. చిన్నపిల్లలను కూడా సెక్స్ అడిక్ట్ చేసేలా అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్ ఎడ్యూకేషన్ (సీపీఎస్) బోర్డు తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపింది. 5వ , ఆ తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో కండోమ్ లు అందుబాటులో ఉండే విధంగా బోర్డు తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఐదు, ఆ పై తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో కండోమ్ లు ఉండే విధంగా సీపీఎస్ బోర్డు చర్యలు చేపట్టింది. ఈ నిబంధన ఆ బోర్డు పరిధిలోని షికాగోలో ఉన్న 600 స్కూళ్లకు ఈ విద్యాసంవత్సరం నుంచే వర్తించనుంది. ఈ మేరకు సీపీఎస్ బోర్డు జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

సెక్స్ ఎడ్యూకేషన్ లో ఇది ఉపయోగపడుతుందని బోర్డు కవర్ చేసుకుంది. 250 ప్రైమరీ, 1000 హైస్కూళ్లలో ఈ కండోమ్ లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. షికాగో ఆరోగ్యశాఖ సహకారంతో కండోమ్ లను సరఫరా చేస్తారు.

కండోమ్స్ అందించడమే కాకుండా విద్యార్థులకు శరీర నిర్మాణ శాస్త్రం, కౌమార యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు, లైంగిక ధోరణులు , లైంగిక ఆరోగ్యం వంటి అంశాలను బోధిస్తారట..

ఇక బోర్డు సైతం పాఠశాలల్లో కల్చర్ మారిందని.. ఇవి అందుబాటులో లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. లైంగిక సంక్రమణ వ్యాధులు, అవాంఛిత గర్భాలు వస్తాయని పేర్కొంది. అలా కాకుండా చూసుకోవడం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. దీనిపై కొంత వ్యతిరేకత వచ్చే అవకాశముందని బోర్డు పేర్కొంది. కానీ దీనిపై తల్లిదండ్రులు, విద్యా నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.