https://oktelugu.com/

బ్యాంబో చెట్ల పెంపకంతో లక్షల్లో సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే..?

దేశంలో చాలామంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తూ వ్యవసాయం చేయడం ద్వారానే డబ్బులను సంపాదించాలని అనుకుంటున్నారు. అలాంటి వాళ్లు బ్యాంబో చెట్ల పెంపకం ద్వారా సులువుగా డబ్బు సంపాదించవచ్చు. ఈ చెట్లను చాలామంది గ్రీన్ గోల్డ్ అని కూడా పిలుస్తారనే సంగతి తెలిసిందే. ఈ చెట్లను పెంచడం ద్వారా అదిరిపోయే రాబడి రైతుల సొంతం అవుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. వెదురు చెట్లను ముఖ్యంగా పరిశ్రమలతో పాటు ఫర్నీఛర్ ఇండస్ట్రీలో వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 13, 2021 4:17 pm
    Follow us on

    దేశంలో చాలామంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తూ వ్యవసాయం చేయడం ద్వారానే డబ్బులను సంపాదించాలని అనుకుంటున్నారు. అలాంటి వాళ్లు బ్యాంబో చెట్ల పెంపకం ద్వారా సులువుగా డబ్బు సంపాదించవచ్చు. ఈ చెట్లను చాలామంది గ్రీన్ గోల్డ్ అని కూడా పిలుస్తారనే సంగతి తెలిసిందే. ఈ చెట్లను పెంచడం ద్వారా అదిరిపోయే రాబడి రైతుల సొంతం అవుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.

    వెదురు చెట్లను ముఖ్యంగా పరిశ్రమలతో పాటు ఫర్నీఛర్ ఇండస్ట్రీలో వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వెదురు చెట్లు పెంచేవాళ్లకు సబ్సిడీని కూడా అందిస్తుండటం గమనార్హం. ఒక్కో చెట్టుకు 120 రూపాయల చొప్పున కేంద్రం వెదురు చెట్ల పెంపకానికి సబ్సిడీని అందిస్తోంది. ఒక్కసారి ఈ చెట్లను పెంచితే 40 సంవత్సరాల పాటు రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుంది.

    వెదురు చెట్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలంలో రాబడిని ఆశించే వాళ్లు ఈ చెట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ చెట్లను నాటిన 4 సంవత్సరాల తర్వాత నుంచి రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుంది. బ్యంబో చెట్లలో మొత్తం 136 రకాలు ఉండగా మంచి రకాన్ని ఎంచుకుంటే మాత్రమే భారీ మొత్తంలో లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    ఒక హెక్టార్ లో 1500 మొక్కలను ఒక మొక్కకు మరో మొక్కకు ఐదు అడుగుల దూరం చొప్పున నాటే అవకాశం ఉంటుంది. ఈ మొక్కలను నాటడం ద్వారా 3 లక్షల రూపాయల నుంచి 3.5 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం అయితే ఉంటుంది.