రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ మామూలుగా లేదే!

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో కాంగ్రెస్ కు కొత్త జోష్ వస్తోంది. ఈరోజు వరుసగా ముగ్గురు నేతలు కాంగ్రెస్ లోకి రావడం సంచలనమైంది. బీజేపీ, టీఆర్ఎస్ లో ఉన్న పాత కాంగ్రెస్, టీడీపీ నేతలు తిరిగి రేవంత్ రెడ్డి గూటికి చేరారు. గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు తనకు సన్నిహితులైన నేతలందరికీ రేవంత్ రెడ్డి మళ్లీ వెనక్కి రప్పిస్తున్నారు. ఇక వైఎస్ హయాంలో వెలుగు వెలిగిన నేతలు సైతం రేవంత్ రెడ్డిపై నమ్మకంతో తిరిగి కాంగ్రెస్ […]

Written By: NARESH, Updated On : July 13, 2021 5:00 pm
Follow us on

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో కాంగ్రెస్ కు కొత్త జోష్ వస్తోంది. ఈరోజు వరుసగా ముగ్గురు నేతలు కాంగ్రెస్ లోకి రావడం సంచలనమైంది. బీజేపీ, టీఆర్ఎస్ లో ఉన్న పాత కాంగ్రెస్, టీడీపీ నేతలు తిరిగి రేవంత్ రెడ్డి గూటికి చేరారు. గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు తనకు సన్నిహితులైన నేతలందరికీ రేవంత్ రెడ్డి మళ్లీ వెనక్కి రప్పిస్తున్నారు. ఇక వైఎస్ హయాంలో వెలుగు వెలిగిన నేతలు సైతం రేవంత్ రెడ్డిపై నమ్మకంతో తిరిగి కాంగ్రెస్ లోకి వస్తున్నారు.

తాజాగా ఒకప్పుడు కాంగ్రెస్ లో వెలుగు వెలిగిన అనంతరం తండ్రి డీఎస్ తోపాటు టీఆర్ఎస్ లోకి వెళ్లిన ధర్మపురి సంజయ్ తాజాగా రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారు. ఈయన స్వయాన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సోదరుడు కావడం విశేషం. తన తమ్ముడు ఏ పార్టీలో ఉంటే తనకేంటి? అంటూ రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లోచేరుతున్నట్టు ప్రకటించాడు.

ఇక బీజేపీకి చెందిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సైతం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు. బీజేపీని వీడడానికి అనేక కారణాలున్నాయన్నారు. వాటి వివరాలు చెబుతానన్నారు.

మరో బీజేపీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు కూడా టీఆర్ఎస్ ను వాడి స్నేహితుడు అయిన రేవంత్ రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ లోకి చేరడానికి రెడీ అయ్యారు. రేవంత్ తో కలిసి టీడీపీలో పనిచేశానని.. మంచి రోజు చూసుకొని కాంగ్రెస్ లో చేరుతానని ప్రకటించారు.

ఇలా రేవంత్ తో సాన్నిహితంగా ఉన్న పాత టీడీపీ నేతలు.. వైఎస్ హయాంలో వెలుగు వెలిగిన కాంగ్రెస్ పాతనేతలు ఇప్పుడు రేవంత్ రెడ్డిపై నమ్మకంతో తిరిగి కాంగ్రెస్ బాట పడుతున్నారు. రేవంత్ అనుకున్న కాంగ్రెస్ పునరేకీకరణ సాధ్యమయ్యేలానే కనిపిస్తోంది. ఇదే జరిగితే 2023 వరకు కాంగ్రెస్ మరింత బలపడడం ఖాయంగా కనిపిస్తోంది.