BJP- Congress and TRS: తెలంగాణలో ముక్కోణపు పోటీలో మునిగేదెవరో? తేలేదెవరో?

BJP- Congress and TRS: తెలంగాణలో రాజకీయం ఎటు వైపు తిరుగుతోంది. ముక్కోణపు పోటీ ఉంటుందని తెలుస్తోన్నా ఓటరు నాడి మాత్రం ఏ విధంగా ఉందనే దానిపై ఇప్పటికి తెలియడం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మూడు పార్టీలు బరిలో నిలిస్తే విజయం ఎవరి పరం కానుందో అంతుచిక్కడం లేదు. సర్వేలు మాత్రం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉండటంతో గులాబీ బాస్ దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా అవి ఫలితం ఇవ్వవనే విషయం తెలుస్తోంది. […]

Written By: Srinivas, Updated On : June 6, 2022 2:39 pm
Follow us on

BJP- Congress and TRS: తెలంగాణలో రాజకీయం ఎటు వైపు తిరుగుతోంది. ముక్కోణపు పోటీ ఉంటుందని తెలుస్తోన్నా ఓటరు నాడి మాత్రం ఏ విధంగా ఉందనే దానిపై ఇప్పటికి తెలియడం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మూడు పార్టీలు బరిలో నిలిస్తే విజయం ఎవరి పరం కానుందో అంతుచిక్కడం లేదు. సర్వేలు మాత్రం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉండటంతో గులాబీ బాస్ దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా అవి ఫలితం ఇవ్వవనే విషయం తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్ని వ్యూహాలు పన్నినా ఓటరు మాత్రం టీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికే నమ్మి చాలా నష్టపోయామని చెబుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.

BJP- Congress and TRS

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చెబుతోంది. అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే నెలలో జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రులు పాల్గొననున్నందున జనసమీకరణ అధిక సంఖ్యలో చేపట్టాలని పార్టీ దిశానిర్దేశం చేస్తోంది. దీంతో పార్టీ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం లక్ష మందిని సమీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భావిస్తోంది.

Also Read: UP Man Bomb Making: పొరుగింటి వారితో వివాదం.. యూట్యూబ్ చూసి బాంబు తయారుచేసి ప్రతీకారం

దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని ఉద్దేశంతో బీజేపీ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగానే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. ఇందు కోసమే అన్ని అస్త్రాలు రెడీ చేస్తోంది. దీనికి అధిష్టానం సూచనల మేరకు నేతలు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు దఫాలు ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహించి టీఆర్ఎస్ పాలనను ఎండగట్టారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే విషయాన్ని తెలియజేశారు.

BJP- Congress and TRS

పోయిన పరువు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ కూడా తెగ ప్రయత్నాలు చేస్తోంది. వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ ప్రకటించారు. దీన్ని రైతులందరికి చేరేలా చూసి పార్టీని బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది తామేనని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నా వారిని ఎవరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా మారింది. కానీ తెలంగాణలో మరోమారు సత్తా చాటాలని భావిస్తున్నా ఆ దిశగా చర్యలు మాత్రం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మూడు పార్టీల భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రధానంగా పోటీలో నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతారో తెలియడం లేదు. ఏ పార్టీని ముంచుతారో? ఏ పార్టీకి అథికారం కట్టబెడతారో అనే అనుమానాలు వస్తున్నాయి. ముక్కోణపు పోటీలో మునిగేదెవరో? తేలేదెవరో అనే సంశయాలు రేకెత్తుతున్నాయి. మొత్తానికి రాబోయే ఎన్నికలు రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read:TS TET Hall Ticket: టెట్ హాల్ టికెట్ల డౌన్ లోడ్ కు మార్గదర్శకాలు ఇవే..

Tags