Hermes Company: ప్రపంచ వ్యాప్తం(World wide)గా ఆర్థిక మాంద్యంతో వేతనాల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వేతనాల పెంపుపై దృష్టి పెట్టడం లేదు. పెంచినా అరకొరే పెంచుతున్నాయి. ఇక ఉద్యోగులు కూడా జాబ్ ఉంటే చాలు అన్నట్లుగా సైలెంట్‌గా ఉంటున్నారు. ఇక కొన్ని సంస్థలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నా.. వేతనాల పెంపు విషయంలో పిసినారితనం ప్రదర్శిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. కానీ, ఇందుకు భిన్నంగా ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్ హెర్మేస్(Hermes) గతేడాది అసాధారణమైన లాభాలు ఆర్జించింది. పరిశ్రమలోనూ దానిస్థానం మెరుగైంది. దీంతో ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. 2025 ప్రారంభంలో తమ కంపెనీలో పనిచేసే ఒక్కో ఉద్యోగికి ఒకటి, రెండు కాదు.. ఏకంగా రూ.4 లక్షలు(4,500 యూరోలు) బోనస్ ప్రకటించింది. 2024లో కంపెనీ ఆదాయం 15.2 బిలియన్ యూరోలను తాకింది. 2023తో పోలిస్తే సిర్థరమైన మారకపు రేట్లలో 15 శాతం, ప్రస్తుత మారకు రేట్ల వద్ద 13 శాతం పెరుగుద ఉంది. హెర్మేస్ దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహంలో భాగంగా లోతుగా పాతుకుపోయిన వారసత్వ కళలు కంపెనీని ఇంతదూరం నడిపించాయి. ఈ లగ్జరీ లెజెండ్ ప్రపంచ వ్యాప్తంగా తన పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకుంటూ నమ్మకమైన కస్టమర్ బేస్ పొందుతోంది.
వ్యాపారంలో వృద్ధి..
హెర్మేన్ సంస్థ వ్యాపారం పెరుగుతుంది. ఈ ఫ్యాషన్ బ్రాండ్ స్థిరమైన అభివృద్ధితోపాటు శ్రామిక శక్తి(Man power)ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. హెర్మేస్ గ్రూప్ 2024 సంవత్సరంలో ఫ్రాన్స్‌లో 1,300 మందితో సహా మొత్తం 2,300 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం శ్రామిక శక్తి 25 వేలకు పెరిగింది. ఫ్యాషన్ యునైటెడ్ నివేదిక ప్రకారం.. సామాజిక నిబద్ధత విధానంలో భాగంగా గ్రూప్ ఉద్యోగులందరికీ రూ.4 లక్షల చొప్పున బోనస్ ప్రకటించింది.
ఎక్కువ వృద్ధి..
జపాన్ మినహా హెర్మేస్ ఈ ఏడాదిలో 7 శాతం ఆదాయ వృద్ధి(Income Gouth) సాధించింది. ఒక నాలుగో త్రైమాసికంలోనే 9 శాతం పెరిగింది. బీజింగ్, షెన్జెన్‌లలో అనేక స్టోర్లు తెరిచినట్లు ప్యాషన్ యునైటెడ్ నివేదించింది. ప్రాన్స్(France) కాకుండా యూరప్‌లో గరిష్ట వృద్ధి కనిపించింది. స్థానిక డిమాండ్, ఈ ప్రాంతంలో పర్యాటకుల సంఖ్య పెరగడం 19 శాతం వృద్ధి కనిపించింది. లిల్లే, నెపుల్లోస్ కొత్త బోటిక్‌ను ప్రారంభించడం ఫ్యాషన్ బ్రాండ్ వృద్ధి, విస్తరణకు తోడ్పడ్డాయి.