Homeబిజినెస్Food Delivery Company : కొత్త ఫుడ్ డెలివరీ సంస్థ వచ్చింది.. స్విగ్గి, జొమాటోకు తీవ్ర...

Food Delivery Company : కొత్త ఫుడ్ డెలివరీ సంస్థ వచ్చింది.. స్విగ్గి, జొమాటోకు తీవ్ర పోటీ తప్పదా?

Food Delivery Company : ఫుడ్ డెలివరీ వ్యాపారంలో ఇప్పటికే జొమాటో, స్విగ్గి పోటాపోటీ సంస్థలు గా ఉన్నాయి. ఈ రెండు సంస్థలు దేశవ్యాప్తంగా కార్యకాలాపాలు సాగిస్తున్నాయి. నచ్చిన ఆహారాన్ని ఇవి స్వల్ప వ్యవధిలోనే వినియోదారులకు అందిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సంస్థలు చేసిన పొరపాట్లు ఇబ్బందికరంగా మారాయి. అవి ఓ వర్గం వారిని ఇబ్బంది పెట్టాయి. ఈ రెండు సంస్థలకు మించి ప్రత్యామ్నాయం లేకపోవడం.. మిగతా సంస్థలు ఉన్నప్పటికీ వీటిలాగా సేవలు అందించకపోవడంతో వినియోగదారులు వీటినే ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ వీటికి దూరంగా ఉంటే కడుపు మాడుతుంది కాబట్టి.. తప్పనిసరి పరిస్థితుల్లో స్విగ్గి లేదా జొమాటో సంస్థల సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సంస్థలకు పోటీగా మరో సంస్థ వచ్చేసింది.

Also Read : కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన స్విగ్గీ, జొమాటో.. ఫుడ్‌ ఆర్డర్‌ చార్జీల సవరణ.. అమలు ఎప్పటి నుంచంటే..!

జొమాటో.. స్విగ్గికి పోటీగా..

బైక్ టాక్సీ కంపెనీగా ర్యాపిడో పేరుపొందింది. ఇప్పుడు ఆ సంస్థ ఫుడ్ డెలివరీ వ్యాపారం లోకి ప్రవేశించబోతోంది. ఇప్పటికే అది రెస్టారెంట్ లతో చర్చలు మొదలుపెట్టింది. ప్రస్తుతం జొమాటో, స్విగ్గి వసూలు చేసే కమిషన్ల ప్రక్రియను సవాల్ చేసే విధంగా సరికొత్త బిజినెస్ మోడల్ ను రాపిడో రూపొందిస్తుందని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే తమ టు వీలర్ ప్లీట్ తో ఇండివిజువల్ రెస్టారెంట్ల నుంచి ఫుడ్ డెలివరీని రాపిడో మొదలుపెట్టింది.. రాపిడో రంగ ప్రవేశం చేస్తే ఫుడ్ డెలివరీ వ్యాపారంలో మరింత పోటీ ఎదురవుతుందని తెలుస్తోంది. మెట్రో నగరాలలో ఫుడ్ డెలివరీ సంస్థలు భారీగా ఆదాయాన్ని నమోదు చేస్తున్నాయి . డిసెంబర్ 31, జనవరి 1, ఫిబ్రవరి 14, హోలీ, ఇతర వేడుకల సమయంలో ఫుడ్ డెలివరీ సంస్థలు వినియోగదారులకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.. అయితే ప్రస్తుతం ఫుడ్ డెలివరీ వ్యాపారంలో స్విగ్గి, జొమాటో దే హవా నడుస్తోంది. అయితే ఇందులోకి ఇప్పుడు ర్యాపిడో ఎంటర్ కావడం సరికొత్త పోటికి ఊతమిస్తోంది. ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది తెలియదు గాని.. ర్యాపిడో మాత్రం యూజర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే బైక్ టాక్సీ పేరుతో ర్యాపిడో ఇప్పటికే సంచలనాలు నమోదు చేసింది. ర్యాపిడో వల్ల ఓలా, ఉబర్ వంటి సంస్థలు ఇప్పటికే తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ర్యాపిడో ఫుడ్ డెలివరీ వ్యాపారం లోకి వస్తే పెను ప్రకంపనలు తప్పవని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వినియోగదారుల మనస్తత్వంలో కూడా మార్పు వచ్చింది. ఒకప్పటిలాగా వారు సంస్థలను చూడటం లేదు. ఎంత మేరకు ఆఫర్లు ఇస్తున్నారని విషయాన్ని మాత్రమే చూస్తున్నారు. అందువల్లే ర్యాపిడో వైపు మొగ్గు చూపేందుకు ఆస్కారం ఉంటుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read : నవంబర్ 6తర్వాత ఓపెన్ కానున్న స్విగ్గీ ఐపీవో.. వాల్యూయేషన్ ఎంతంటే ?

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular