CM KCR lunch with officials: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఎప్పుడు వైవిధ్యం చూపిస్తుంటారు. ఆయన ప్రవర్తనతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. రాష్ర్టంలో జరిగే పరిణామాల్లో తనదైన శైలిలో వ్యవహరిస్తుంటారు. ఎప్పుడు నియంతలా ప్రవర్తించే సీఎం కేసీఆర్ అప్పుడప్పుడు వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఇప్పటికే దళితబంధు పథకంతో అందరి దృష్టిని ఆకర్షించిన సీఎం ప్రస్తుతం తన వైఖరిలో పలు విధాలైన పద్ధతులు కనిపిస్తున్నాయి. ఎప్పుడు అధికారులను పరుగులు పెట్టించే సీఎం వారితో కలిసి భోజనం () చేద్దామని చెప్పడం వారిని ఆశ్చర్యపరిచింది.
శుక్రవారం కరీంనగర్ లో కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష సమావేశానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అధికారులకు దళితబంధు పథకంపై దిశానిర్దేశం చేశారు. అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. పథకం అమలుపై కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దళితబంధు పథకంపై రాష్ర్టవ్యాప్తంగా వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో కరీంనగర్ లో సమావేశంపై అందరు ఉత్కంఠగా ఉన్నారు. అందరికి వర్తింపజేయాలని అడుగుతున్నారు.
అధికారులతో కలిసి సీఎం కలివిడిగా మాట్లాడారు. గతంలో ఎన్నడు లేని విధంగా అధికారులతో కలిసి భోజనం చేస్తామని చెప్పడంతో అందరు ఆశ్చర్యపోయారు. గతంలో ఎన్నడు కూడా సీఎం ఇలా మాట్లాడలేదని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో జిల్లాల్లో పర్యటించేటప్పుడు సీఎం కొంతమందిని మాత్రమే భోజనానికి అనుమతించేవారు కానీ ఈసారి మాత్రం అందరితో కలిసి భోజనం చేద్దామని చెప్పడం గమనార్హం.
సభలు, సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు సీఎంకు ప్రత్యేకంగా షామియానా ఏర్పాటు చేస్తుంటారు. సీఎం అందులోనే భోజనం చేసేవారు. కానీ ఈసారి అందుకు విరుద్దంగా చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎంలో వచ్చిన మార్పుకు కారణం ఏంటని అందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పు శాశ్వతమా తాత్కాలికమా అని అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటారా అని ఆలోచనలో పడిపోయారు.