AP TDP president Atchannaidu: రికార్డులు తయారు చేస్తున్నా.. ఎవరిని వదలం.. పోలీసులపై అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు

AP TDP president Atchannaidu: తెలుగు దేశం(TDP) కదం తొక్కింది. పెట్రోల్, డీజిల్ పెంపుపై ఆందోళన బాటపట్టింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది. ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchennaidu) నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ లో రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. 155 స్థానాలలో చంద్రబాబు నాయుడు(Chandrababu) మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. తాను అధికారంలోకి వస్తే కొంతమంది […]

Written By: NARESH, Updated On : August 28, 2021 4:50 pm
Follow us on

AP TDP president Atchannaidu: తెలుగు దేశం(TDP) కదం తొక్కింది. పెట్రోల్, డీజిల్ పెంపుపై ఆందోళన బాటపట్టింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది. ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchennaidu) నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ లో రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. 155 స్థానాలలో చంద్రబాబు నాయుడు(Chandrababu) మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. తాను అధికారంలోకి వస్తే కొంతమంది పెద్దలను పలకరించే వారు ఉండరంటూ అచ్చెన్నాయుడు హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా టీడీపీ ఏపీ వ్యాప్తంగా తలపెట్టిన ఆందోళనల్లో అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.

రెండున్నర సంవత్సరాలు నుంచి అచ్చెన్నాయుడు బయటకు రావట్లేదు అని కొందరు పోలీసులు అనుకోవచ్చని.. 30 ఏళ్ళ అనుభవం ఉన్న అచ్చెన్నాయుడుకి ఏం చేయాలో తెలుసు అని తెలిపారు. రెండేళ్ళుగా టెక్కలిలో ఓ పోలీస్ అధికారి గురించి వింటున్నానని.. ఈరోజు ప్రత్యక్షంగా చూశానని.. పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్య పాలన చేస్తున్న జగన్ కు ఇదే నా హెచ్చరిక అని అచ్చెన్న హెచ్చరించారు.

కింజరాపు కుటుంబం నిబద్ధత కలిగిన కుటుంబమని అచ్చెన్నాయుడు అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ లేకుండా చేయాలని జగన్ సామ ధాన బేధ దండోపాయాలు ఉపయోగించాడని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని కార్యకర్తల బిల్లులు ఆపేశారని మండిపడ్డారు. టిడిపి సానుభూతి పరులను అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. మన వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టారన్నారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఉండదని జగన్ అనుకున్నాడన్నారు. నన్ను అరెస్ట్ చేసి పంచాయతీ ఎన్నికల్లో నెగ్గుకురావాలని చూశారని.. వాళ్ళు గెలిచిన పంచాయతీలు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావన్నారు.

2024 లో 155 స్థానాలతో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడని.. నేను అధికారంలోకి వస్తే మీరు ఊర్లు విడిచి వెళ్లిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా అచ్చెన్నాయుడు హెచ్చరించారు. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారున్నారు. నరేగా బిల్లులు చెల్లింపులు జరగలేదని టెక్కలిలో టిడిపి నేతలు ఎండివో కి వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు..

రెండున్నర సంవత్సరాలు అయ్యిందని.. రెండు లక్షల కోట్ల అప్పులు చేశారని.. తాజాగా కాగ్ నివేదిక వచ్చిందన్నారు. రెండు మాసాలకు 50 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని.. నాయకుడు అంటే పప్పు బెల్లాలు పంచేవాడా? అని అచ్చెన్నా ప్రశ్నించారు. అప్పులు చేసి ప్రజలకు పంచడానికి ముఖ్యమంత్రే కావాలా ? నా కారు డ్రైవర్ అయినా ఆ పని చేస్తాడని విమర్శించాడు. మన రాష్ట్రానికి రెండున్నర ఏళ్ళల్లో పెట్టుబడులు కేవలం 2 వేల కోట్లు మాత్రమేనన్నారు. వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు అధికారులు తాళాలు వేసుకు వెళ్లిపోయారని.. నదిలో నీళ్ళు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

టిడిపి పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయని జగన్ ఊరూరా తిరిగి చెప్పాడని.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ పై దేశంలోనే అత్యధిక వ్యాట్ వేస్తున్న రాష్ట్రం ఏపీ అని అచ్చెన్నాయుడు విమర్శించాడు. రోడ్ల అభివృద్ధి పేరుతో అదనంగా 4 రూపాయలు ప్రభుత్వం వసూలు చేస్తోందన్నారు.అయినా ఎక్కడా సరైన రోడ్లు వేసిన దాఖలాలు లేవన్నారు. బూమ్ బూమ్ పేరుతో జగన్ జనాన్ని దోచుకుంటున్నాడన్నారు. జగన్ బ్రాండ్ లు తాగితే ప్రజల ఆరోగ్య పరిస్థితి అంతే సంగతులు అన్నట్లు ఉంటే. మరోవైపు కొత్తగా ఫుట్ పాత్ లపై బీర్లు అమ్మతారంట అని ధ్వజమెత్తారు.

చంద్రబాబుని ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోపెట్టడమే అచ్చెన్నాయుడు లక్ష్యం అని ప్రకటించారు. ఇంతకాలం ప్రజల్లో ఒక భయం ఉండేది.. ఇప్పుడిప్పుడే అందరిలో భయం పోతోంది..ప్రజలు బయటకు వచ్చి ప్రతిఘటిస్తున్నారన్నారు.

మా పార్టీ పని అయిపోయింది అని వైసిపి కార్యకర్తలే చెప్పే పరిస్థితి నెలకొందన్నారు. ఒకప్పుడు నన్ను ఊపిరి పీల్చుకునే తీరిక లేకుండా నా వెనక తిరిగిన పోలీసులు ఈరోజు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే బాధేస్తోందన్నారు. ఎవరో చెప్పినట్లు కాకుండా, పోలీసులు బాధ్యతగా ఉండాలన్నారు…

అచ్చెన్నాయుడు హోంమంత్రి అయ్యేటప్పటికి నేను రిటైర్ అయిపోతా అని నాపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు అనుకుంటున్నారని.. మీరు ఏ కలుగులో దాక్కున్నా బయటకు లాక్కోస్తానని అచ్చెన్నాయుడు సంచలన హెచ్చరికలు చేశారు.

56 కొత్త కార్పొరేషన్ లు ఏర్పాటు చేశారని.. నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాని పదవులు అవి అచ్చెన్నా వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు.