Telangana Govt Jobs Notifications: ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కారు దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. నోటిఫికేషన్లు విడుదల చేయాలని సంకల్పించింది. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేలా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నా వాటిని భర్తీ చేసేందుకు సిద్ధమేనని సీఎం కేసీఆర్ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఖాళీగా ఉన్న దాదాపు 80 వేల ఉద్యోగాల కోసం రెడీ గాఉన్నట్లు ప్రకటించి నిరుద్యోగుల ఎదురు చూపులకు కళ్లెం వేశారు. ఇక ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదివరకు ప్రతిపక్షాలు ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేశాయి. దీంతో వారి నోళ్లకు తాళం వేసే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాల భర్తీ పై ఫోకస్ చేసినట్లు సమాచారం. అన్నింటికి ఒకే సమాధానంగా చేసుకుని కేసీఆర్ ముందుకు వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీపై ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పడం గమనార్హం.
Also Read: కర్నూలు జనసేన ఆఫీసుకు తాళం.. అన్నంత పని చేసిన వైసీపీ నేతలు
ప్రభుత్వ ఉద్యోగమంటే అందరికి ఇష్టమే. కానీ అందరికి ఉద్యోగాలు ఇవ్వడం అంటే సాధ్యం కాదు. అందుకే ఉన్న ఉద్యోగాల్లోనే పోటీపడి ఉద్యోగం సాధించేందుకు యువత సిద్ధమవుతోంది. ఎలాగైనా పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సంపాదించాలని ఆశగా ఉన్నారు. ఈ క్రమంలో కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగంలో చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు.
అవసరమైతే మరో పదివేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు. దీంతో నిరుద్యోగుల్లో మరింత ఉత్సాహం పెరుగుతోంది. జాబ్ కోసం అహర్నిశలు శ్రమించి ఎలాగైనా ఉద్యోగం కొట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగ కల్పన తరువాత మంచి జీవితం ఉంటుందని ఊహించుకుంటూ అందుకనుగుణంగా సిద్ధమవుతున్నారు.
Also Read: జగన్ ను దగ్గరి నుంచి చూస్తే.. పోసాని షాకింగ్ వ్యాఖ్యలు