Komatireddy Venkat Reddy: ప్రస్తుతం టీ కాంగ్రెస్‌లో దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత రోజుకో అసమ్మతి నేత తెరమీదకు రావడం.. నానా రాద్ధాంతం చేయడం కామన్ అయిపోయింది. కాగా ఈ నేపథ్యంలోనే మొన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీని కలవడం కాంగ్రెస్ లో సంచలనం రేపింది. అదే సమయంలో ఇటు అసెంబ్లీలో ఆయన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపించారు.
దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కూడా కాంగ్రెస్‌ను వీడుతారని, బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగింది. తనకు టీపీసీసీ పదవి ఇవ్వలేదని వెంకట్ రెడ్డి ఎప్పటి నుంచో అసంతృప్తిలో ఉన్నారు. ఇవన్నీ ఆయన పార్టీ మారుతారని సంకేతాలు ఇచ్చాయి. ఇక ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అయితే ఎన్నో సార్లు బీజేపీలో చేరుతారంటూ బహిరంగంగానే ప్రకటించారు.
Also Read: కర్నూలు జనసేన ఆఫీసుకు తాళం.. అన్నంత పని చేసిన వైసీపీ నేతలు
అయితే ఈ వార్తలన్నింటికీ ఈ రోజు వెంకట్‌రెడ్డి పులిస్టాప్ పెట్టేశారు. ఆయన ఈ రోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డితో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. తన ప్రాణం ఉన్నంత కాలం కాంగ్రెస్‌లోనే ఉంటానంటూ తేల్చి చెప్పేశారు. తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, తాను మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పుకొచ్చారు.
ఇతర పార్టీల్లో తమ పార్టీలో కంటే ఎక్కువ గొడవలు ఉన్నాయని, అవన్నీ చాలా కామన్ అంటూ కొట్టి పారేశారు. అయితే కోమటిరెడ్డి కామెంట్లతో రేవంత్‌కు మద్దతు పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ వైపు జగ్గారెడ్డి లాంటి వారు తిరుగుబాట ఎంజా ఎగిరేసిన సమయంలోనే.. ఇలా పెద్ద మద్దతు దొరకడం రేవంత్‌కు చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి.
తాను అభివృద్ధి పరంగానే కేంద్ర మంత్రులను, ప్రధాని మోడీని కలిశానని ఆ రూమర్లకు కూడా చెక్‌పెట్టాడు కోమటిరెడ్డి. మరి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్న రేవంత్‌కు కోమటిరెడ్డి పూర్తి స్థాయిలో సహకరిస్తారా లేదా అన్నది మాత్రం వేచిచూడాలి.
Also Read: ఇక చాలు.. వారిపై యాక్షన్ తీసుకోవాల్సిందే.. టీ కాంగ్రెస్ లో ప్రక్షాళన షురూ..