https://oktelugu.com/

జేసీ రెడ్డప్పను వదలనంటున్న జగన్

వదల బొమ్మాళీ.. వదలా.. అని ‘అరుంధతి’ సినిమాలో విలన్ హీరోయిన్ అనుష్కను అన్నట్టే.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ సైతం.. తన రాజకీయ ప్రత్యర్థి.. అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని వదలడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుతో జట్టుకట్టి వైఎస్ జగన్ పై దారుణ విమర్శలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు అనుభవిస్తున్నాడని పొలిటికల్ సర్కిల్స్ లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన బిజినెస్ అయిన జేసీ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 8, 2020 / 08:40 PM IST
    Follow us on


    వదల బొమ్మాళీ.. వదలా.. అని ‘అరుంధతి’ సినిమాలో విలన్ హీరోయిన్ అనుష్కను అన్నట్టే.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ సైతం.. తన రాజకీయ ప్రత్యర్థి.. అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని వదలడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుతో జట్టుకట్టి వైఎస్ జగన్ పై దారుణ విమర్శలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు అనుభవిస్తున్నాడని పొలిటికల్ సర్కిల్స్ లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

    జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన బిజినెస్ అయిన జేసీ ట్రావెల్స్ పై సీఎం జగన్ అధికారంలోకి ఎక్కగానే దెబ్బకొట్టారు. ఆయన బస్సుల అక్రమాలు నిగ్గుతేల్చి సీజ్ చేశారు. అనంతరం రాజకీయంగానూ ఆయనను చావుదెబ్బ తీశారు. అనంతపురంలో కోలుకోకుండా దెబ్బేశారు. అనంతపురం మాజీ ఎంపీ జేసీ వర్గానికి జగన్ చెక్ పెట్టారు. తాడిపత్రిలో బలమైన నాయకుడిగా ఉన్న షబ్బీర్ అలీని వైసీపీలో చేర్చుకున్నారు. షబ్బీర్ అలీతోపాటు పలువురు అనుచరులు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. మొత్తం 500 మంది ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ప్రధాన అనుచరుడే పార్టీ మారడం జేసీ బ్రదర్స్ ను కోలుకోనీయకుండా చేసింది. ఇదంతా జగన్ ప్లాన్ కావడం.. అనంతపురంలో జేసీ పునాదులు కదిల్చే పని కావడంతో జేసీకి షాక్ తగిలింది.

    అక్రమంగా చేస్తున్న జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సులపై ఉక్కుపాదం మోపారు. తాడిపత్రిలో జేసీ లారీ వ్యాపారాలకు సైతం చెక్ పెట్టారు. ఇప్పుడు నేతలను లాగుతూ వారిని అష్టదిగ్భంధనం చేస్తున్నారు. జగన్ దెబ్బతో జేసీ జిల్లాలో ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదంలో పడ్డారు.

    ఇప్పటికే జేసీ ట్రావెల్స్ బస్సులను భారీగా సీజ్ చేసి ఆయన వ్యాపారాన్ని దెబ్బకొట్టిన సీఎం జగన్.. తాజాగా సోమవారం జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. జేసీకి చెందిన 76 వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు. బీఎస్3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్4గా మార్పు చేసి రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు అధికారుల విచారణలో తేలింది. 60 వాహనాలను రవాణా అధికారులు సీజ్ చేశారు. మిగతా 94 వాహనాలను జేసీ బ్రదర్స్ అజ్ఞాతంలో దాచిపెట్టారు. వాటిలో నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నట్లు అధికారులు గుర్తించారు.

    ప్రయాణికుల జీవితాలతో జేసీ ట్రావెల్స్ చెలగాటం ఆడిందని అనంతపురం డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ శివరాంప్రసాద్ తెలిపారు. స్క్రాప్ కింద కొన్న బస్సులు, లారీలను రోడ్లపై నడపడం దారుణమన్నారు. జేసీ కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశామని.. ఫోర్జరీ వ్యవహారంపై నివేదిక అందజేసినట్లు పేర్కొన్నారు.

    ఇలా జేసీ బ్రదర్స్ ను అష్టదిగ్బంధనం చేసేలా జగన్ పంతం పట్టారు. ఇంటా బయటా ఆయన వ్యాపారాలను, రాజకీయ బలాన్ని జగన్ టార్గెట్ చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

    -నరేశ్ ఎన్నం