https://oktelugu.com/

హీరో కంటే  విలనే హైలైట్ అవుతాడట !

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా షార్ప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్– 1` సృష్టించిన సంచలనాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించి పాన్ ఇండియా సినిమా అయింది.  ఇక ఈ చిత్రంలో ప్రధానమైన ప్రతినాయకుడి పాత్ర అధీరా కోసం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే.  దీంతో సినిమా పై  హైప్ మరింత పెరిగింది.  ప్రశాంత్ నీల్ సినిమాను పార్ట్ 1 కంటే […]

Written By:
  • admin
  • , Updated On : June 9, 2020 / 10:28 AM IST
    Follow us on

    కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా షార్ప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్– 1` సృష్టించిన సంచలనాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించి పాన్ ఇండియా సినిమా అయింది.  ఇక ఈ చిత్రంలో ప్రధానమైన ప్రతినాయకుడి పాత్ర అధీరా కోసం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే.  దీంతో సినిమా పై  హైప్ మరింత పెరిగింది.  ప్రశాంత్ నీల్ సినిమాను పార్ట్ 1 కంటే భీభత్సమైన రీతిలో తెరకెక్కిస్తున్నాడు, బడ్జెట్ ను కూడా ఆ స్థాయిలొనే ఖర్చు పెడుతున్నాడు.  ఇక సంజయ్ దత్ కి సంబంధించిన పార్ట్ ను  ఇప్పటికే షూట్ చేశారు. అయితే దానికి ఎడిటింగ్ కూడా పూర్తయిందట.  సంజయ్ దత్  సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని.. సినిమా మొత్తంలోనే  అధీరా క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుందని.. ‘యశ్’ కంటే కూడా సంజయ్ దత్ నే హైలెట్ అవుతాడని కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది.

    కాగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తోంది. యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ చిత్రం కోసం అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేమికులు కూడా గట్టిగానే ఎదురు చూస్తున్నారు.  ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ అయితే ఈ సినిమా పై పెట్టుకున్న అంచనాలు అన్ని ఇన్ని కావు. ఈ సీక్వెల్ లో తొలి భాగాన్ని మించి భారీ యాక్ష‌న్ ని చూపించ‌నున్నారు ప్రశాంత్ నీల్.

     ఇక కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గ‌నులు. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. కేజీఎఫ్   గ‌నుల‌ పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ దానిని తొలి భాగంలోనే ప్రశాంత్ అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీక‌ర మాఫియాని ప‌తాక స్థాయిలో చూపించ‌నున్నారు.