https://oktelugu.com/

మధ్యాహ్నం వరకే జీహెచ్ఎంసీ ఫలితాలు రానున్నాయా?

జీహెచ్ఎంసీ ఎన్నికలకు నేడు కౌంటింగ్ జరుగుతోంది. శుక్రవారం ఉదయం 8గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ షూరు అయింది. కౌంటింగ్ కేంద్రాల్లోని ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఇక కౌంటింగ్ పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. Also Read: జీహెచ్ఎంసీ: ప్రారంభమైన కౌంటింగ్, తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు‌ 150డివిజన్ల పరిధిలోని 1,122మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 4, 2020 / 09:04 AM IST
    Follow us on


    జీహెచ్ఎంసీ ఎన్నికలకు నేడు కౌంటింగ్ జరుగుతోంది. శుక్రవారం ఉదయం 8గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ షూరు అయింది. కౌంటింగ్ కేంద్రాల్లోని ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఇక కౌంటింగ్ పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.

    Also Read: జీహెచ్ఎంసీ: ప్రారంభమైన కౌంటింగ్, తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు‌

    150డివిజన్ల పరిధిలోని 1,122మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కించిన అనంతరం బ్యాలెట్ పత్రాల ఓట్ల లెక్కింపు చేయనున్నారు. అనంతరం బ్యాలెట్ పత్రాల లెక్కింపు జరుగనుంది.

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొదటి ఫలితం మెహదీపట్నం నుంచి వెలువడే అవకాశం ఉంది. రౌండ్ కు 14వేల ఓట్లు లెక్కింపు జరుగనున్నాయి. అయితే మోహదీపట్నంలో కేవలం 11వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో తొలి ఫలితం ఇక్కడి నుంచే అవకాశం ఉంది. ఇక మెజార్టీ ఫలితాలు రెండో రౌండ్లో వచ్చే అవకాశం కన్పిస్తున్నాయి.

    Also Read: ప్రారంభమైన కౌంటింగ్.. మొదటి ఫలితం ఇక్కడి నుంచే..!

    రెండో రౌండ్ లో 28వేల ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో రెండో రౌండ్లోనే 136 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు రానున్నాయి. ఇక మూడో రౌండ్లో 13డివిజన్లకు సంబంధించిన ఫలితాలు రానున్నాయి. దీంతో దాదాపుగా మధ్యాహ్నం 2గంటల వరకు ఫలితాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    తాజా సమాచారం మేరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగులో బీజేపీ 35స్థానాల్లో.. టీఆర్ఎస్ 12 స్థానాల్లో.. కాంగ్రెస్ ఒకటి రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉందని తెలుస్తోంది. అయితే పోస్టల్ బ్యాలెట్లు ఆయా డివిజన్లో చాలా తక్కువగా ఉండటంతో పోస్టల్ ఓట్ల ప్రభావం అభ్యర్థుల గెలుపోటములపై పెద్దగా ప్రభావం చూపించక పోవచ్చు. ఒకవేళ హోరాహోరీగా పోటీ జరిగితే మాత్రం పోస్టల్ ఓట్లే కీలకంగా మారే అవకాశం ఉంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్