రాష్ట్రంలోని టీఆర్ఎస్ నా? లేక కేంద్రంలోని బీజేపీనా? హైదరాబాద్ ఓటరు మదిలో ఎవరున్నారు. నిన్న ఎగ్జిట్ పోల్స్ లో అయితే అన్ని సర్వేలు గులాబీ పార్టీదే విజయం అన్నారు. అయితే బీహార్ లోనూ ఎగ్జిట్ పోల్స్ గతితప్పాయి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ పీఠం ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది. . గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ హోరాహోరీ తలపడిన ఈ పోరులో అంతిమ విజయం ఎవరిదనేది కొద్దిసేపట్లో తేలనుంది. రెండు పార్టీలు విజయంపై ధీమాతో ఉన్నాయి.
Also Read: రేపే కౌంటింగ్.. ఆ రెండు డివిజన్లలో రీ పోలింగ్ ఉంటుందా?
గ్రేటర్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యింది. పోలింగ్ కేంద్రాల వద్దకు కౌంటింగ్ సిబ్బంది చేరుకొని తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ చేస్తున్నారు. అనంతరం బ్యాలెట్ బాక్సుల లెక్కింపు జరుపనున్నారు.
30 సర్కిళ్లలోని 30 ప్రదేశాల్లో లెక్కింపు కేంద్రాల కోసం 150 హాళ్లను సిద్ధం చేశారు. ప్రతి హాల్‌లోనూ 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై 1000 ఓట్ల లెక్కింపు వంతున ఒక రౌండ్‌లోనే 14 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.
Also Read: గ్రేటర్ లో ‘టీఆర్ఎస్’ కే పట్టం.. ఎందుకు?
నగరంలోని మెజారిటీ డివిజన్లలో 28 వేలలోపు ఓట్లు పోలైన విషయం తెలిసిందే. దాంతో, రెండు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.
కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్