Civil services results released : సివిల్స్ ఫలితాలలో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. సాయి శివాని 11వ ర్యాంకు సాధించింది. బన్నా వెంకటేష్ 15వ ర్యాంకు పొందాడు. అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్ కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ 68, చేతనారెడ్డి 110, చెన్నం రెడ్డి శివ గణేష్ రెడ్డి 119 ర్యాంకులు సాధించారు.. ఇక టాప్ ర్యాంకర్ గా శక్తి దుబే నిలిచారు. ఆ తర్వాత హర్షిత గోయల్, డోంగ్రే అర్చిత్ పరాగ్, షా మార్గి చిరాగ్, ఆకాష్ గార్గ్, కోమల్ పునియా, ఆయుషి బన్సల్, రామకృష్ణ ఝా, ఆదిత్య విక్రం అగర్వాల్, మయాంక్ త్రిపాటి టాప్ ర్యాంకర్లుగా ఉన్నారు. వీరంతా కూడా ఐఏఎస్ లు అయ్యే అవకాశం ఉంది.
Also Read : కొన్ని వందల సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉండేది? మనుషులు ఎలా ఉండేవారు?
గత ఏడాది ఫిబ్రవరి నోటిఫికేషన్
కేంద్ర ప్రభుత్వంలో కొనసాగే వివిధ శాఖలలో మొత్తం 1056 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టులను భర్తీ చేయడానికి గత ఏడాది ఫిబ్రవరిలో యుపిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 16న ప్రిలిమ్స్ నిర్వహించింది. అందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. మెయిన్స్ పరీక్షలో సత్తా చాటిన వారికి ఏడాది జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు అనేక విభాగాలలో ముఖాముఖి నిర్వహించింది. అందులో ఉత్తమ ఫలితాలు సాధించిన 1,009 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఫోటో దిగిన 335 మంది జనరల్ కేటగిరిలో ఎంపిక కాగా.. ఈడబ్ల్యూఎస్ కేటగిరి నుంచి 109 మంది ఎంపికయ్యారు. ఎస్సీ విభాగంలో 160 మంది, ఎస్టీ విభాగం నుంచి 87 మంది ఎంపికయ్యారు. సివిల్స్ పరీక్షలకు తీవ్రస్థాయిలో సన్నద్ధత అవసరం. పైగా అనేక దశల్లో వడపోతలు ఉంటాయి. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. మెయిన్స్ డిస్క్రిప్టివ్ మెథడ్ లో ఉంటుంది. ఈ రెండిట్లో అర్హత సాధించిన వారు ఇంటర్వ్యూకు ఎంపిక అవుతారు. ఇంటర్వ్యూను యూపీఎస్సీ నియమించిన అధికారుల బృందం నిర్వహిస్తుంది. ఇందులో రకరకాల ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థుల మేధాశక్తిని పరీక్షించేందుకు ఇంటర్వ్యూ ప్యానల్ రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. అందులో కొన్ని సామాజిక కోణానికి సంబంధించినవి.. మరికొన్ని వర్తమాన అంశాలకు సంబంధించినవి.. ఇంకొన్ని సబ్జెక్టుకు సంబంధించినవి ఉంటాయి. ఇందులో మెరుగైన సమాధానాలు చెప్పిన వారిని ఇంటర్వ్యూ బోర్డ్ ఎంపిక చేస్తుంది. అయితే యుపిఎస్సి నియామకాలు జాబ్ క్యాలెండర్ ఆధారంగానే కొనసాగుతాయి. ఇందులో ప్రతి పరీక్ష కూడా అత్యంత పగడ్బందీగా జరుగుతుంది. ఇందులో ఏమాత్రం అవకతవకలకు అవకాశం ఉండదు. అయితే ఈసారి వెల్లడించిన యూపీఎస్సీ ఫలితాలలో తెలుగు అభ్యర్థులు ఎక్కువ ర్యాంకులు సాధించడం విశేషం.
Also Read : నాగరికతకు నడక నేర్పిన నగరాలివి.. అవి ఎక్కడ బయల్పడ్డాయంటే?