Mahesh Babu : మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) సినిమా గురించి అటు మహేష్ బాబు కానీ , ఇటు రాజమౌళి కానీ ఒక్క అప్డేట్ కూడా అధికారికంగా చెప్పలేదు. కానీ ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో ప్రతీ రోజు ఎదో ఒక ఆసక్తికరమైన లీక్స్ వస్తూనే ఉన్నాయి. అవి అభిమానులను ఉర్రూతలూ ఊగిస్తున్నాయి. మహేష్ బాబు ని ఇప్పటి నుండే రాజమౌళి తీయబోయే సినిమా గురించి ఊహించుకుంటూ అభిమానులు గూస్ బంప్స్ తెచ్చుకుంటున్నారు. మే నెల నుండి రెండవ షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారు. ఈ షెడ్యూల్ కోసం ఒక భారీ సముద్రపు సెట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. సుమారు నెల రోజుల పాటు జరగనున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ లో మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా(Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కూడా పాల్గొనబోతున్నాడు.
Also Raed : మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు డైలాగ్ రైటర్ గా మారిన స్టార్ డైరెక్టర్!
హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఈ యాక్షన్ సన్నివేశాన్ని కంపోజ్ చేయబోతున్నాడు. ఇందులో మహేష్ బాబు బోట్ లో మూడు వేళ మందితో పోరాటం చేయబోతున్నాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన వర్క్ షాప్ గత నెల రోజుల నుండి జరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ చిత్రం లో మహేష్ బాబు డైనోసార్స్ తో పోరాటం చేసే ఒక సన్నివేశం ఉంటుందట. డైనోసార్స్ ఎన్నో వందల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి కదా?, మరి ఈ చిత్రం లో ఎలా చూపించబోతున్నారు, ఈ సినిమా డైనోసార్స్ కాలం నాటికి చెందినదా?, రీసెంట్ గా విడుదలైన షూటింగ్ వీడియో ని చూస్తే అలా అనిపించడం లేదే?, పోనీ ఫిక్షనల్ గా చూపించే క్రమంలో అమెజాన్ అడవుల్లో ఎవరికీ తెలియని ఒక ప్రదేశం లో డైనోసార్స్ ఉన్నాయి అనే విధంగా రాజమౌళి చూపించబోతున్నాడా అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో జరుగుతున్న చర్చ.
ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే కాదు, హాలీవుడ్ లో కూడా ఇలాంటి ఆలోచనతో పోరాట సన్నివేశాన్ని ఎవ్వరీ చిత్రీకరించలేదట. మరి రాజమౌళి అంటే ఆషామాషీ అనుకున్నారా ?, ఆ మాత్రం ఉంటుంది. ఈసారి రాజమౌళి టార్గెట్ హాలీవుడ్ మార్కెట్ అని స్పష్టంగా తెలుస్తుంది. ఇనాళ్ళు ఎదురు చూసినందుకు మహేష్ కి తన అర్హత, కెపాసిటీ కి తగ్గ సినిమాని రాజమౌళి అందిస్తున్నాడని, హాలీవుడ్ సినిమాల రికార్డ్స్ అన్ని ఈ దెబ్బకు డేంజర్ లో పడినట్టే అని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్ తో నిర్మాణం అవుతున్న ఈ ప్రాజెక్ట్, అనుకున్న రీతిలో తీస్తే 5000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మన ఊహలకు మించి తీస్తే హాలీవుడ్ సినిమాల తరహాలో 1 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టొచ్చు.
Also Read : 3000 మందితో పడవలో మహేష్ బాబు పోరాటం..రాజమౌళి మార్క్ సన్నివేశం!