CM Revanth Reddy: సినీ, రాజకీయ రంగానికి దగ్గర సంబంధం ఉంటుంది. పరస్పర అవగాహన కూడా ఉంటుంది. సినీ రంగం నుంచి వచ్చిన ఎంతోమంది ప్రముఖులు రాజకీయంగా రాణించారు. ఎన్టీఆర్, చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ బలమైన ముద్ర చూపించగలిగారు. కానీ సినీ రంగానికి చెందిన వ్యక్తులు పాలకులుగా మారిన, ఇతర రాజకీయ నాయకులు పీటమెక్కినా సినీ రంగం మాత్రం తన అవసరం వరకు మాత్రమే వ్యవహరిస్తుంది. ఇది చాలా సందర్భాల్లో స్పష్టమైంది. అందుకే ఇప్పుడు అధికార పార్టీ నేతలు సినీ రంగం విషయంలో గట్టిగానే ఉంటున్నారు.
2014లో విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. ఆ సమయంలో సినీ రంగం నుంచి కనీస పలకరింపు కూడా కెసిఆర్ కు లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని కనీసం శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా సినీ రంగ ప్రముఖుల మనసు ఒప్పుకోలేదు. అక్కడకు కొద్ది రోజులకే సినీ రంగానికి చెందిన స్టూడియోలకు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారాలకు ప్రభుత్వం నోటీసులు పంపించింది. దీంతో అప్పటినుంచి సినీ రంగ ప్రముఖులు క్యూ కట్టారు. నిన్న గద్దె దిగే వరకు కెసిఆర్ వద్ద లొంగి ఉండేవారు.
చంద్రబాబు హయాంలో సినిమా రంగం ఆయన గౌరవించేది. ఆయన ఆదేశాలను పాటించేది. సినీ రంగంలో ప్రముఖులు ఆయన సామాజిక వర్గానికి చెందినవారు కావడం. నిర్మాతలు, దర్శకుల్లో ఎక్కువమంది మద్దతు దారులు ఆ పార్టీలో ఉండడం అప్పట్లో చంద్రబాబు మాట నడిచేది. అయితే విభజిత ఏపీకి చంద్రబాబు తొలి సీఎంగా అయినా కెసిఆర్ అంతటి చొరవ చంద్రబాబుపై సినీ పరిశ్రమ చూపించేది కాదు. అధికారంలోకి జగన్ వచ్చిన సినీ పరిశ్రమ పలకరించలేదు. కొద్ది రోజుల తర్వాత టిక్కెట్ల వ్యవహారం తెరపైకి రావడంతో ఆగమేఘాల మీద సినీ ప్రముఖులు ఆయన కలిశారు. సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు.
అయితే ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ కు సినీ పరిశ్రమ పరీక్ష పెడుతోంది. సినీ పరిశ్రమతో రేవంత్ కు సంబంధాలు అంతంత మాత్రమే. ఎప్పుడైతే రేవంత్ సీఎం అయ్యారు అప్పటినుంచి సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. సినీ పరిశ్రమ నుంచి ఒక్క దిల్ రాజు మాత్రమే వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మిగతావారు ముఖం చాటేసారు. అయితే ఈ విషయంలో కెసిఆర్, జగన్ మాదిరిగా రేవంత్ ట్రీట్మెంట్ ఇస్తారో? లేదో? చూడాలి.