Hi Nanna Collection: హాయ్ నాన్న 5 డేస్ కలెక్షన్స్… అక్కడ దుమ్మురేపుతున్న నాని, అసలు ఊహించలేదు!

తెలుగు రాష్ట్రాల్లో హాయ్ నాన్న ఫస్ట్ డే కేవలం రూ. 2.9 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇది నాని కెరీర్ లోయస్ట్ కావడం విశేషం. హాయ్ నాన్న డిజాస్టర్ కావడం ఖాయమని అనుకుంటుండగా... అనూహ్యంగా పుంజుకుంది.

Written By: NARESH, Updated On : December 12, 2023 12:34 pm

Hi Nanna Collection

Follow us on

Hi Nanna Collection: హీరో నాని లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న. ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ డ్రామాగా హాయ్ నాన్న తెరకెక్కింది. హాయ్ నాన్న చిత్రానికి పాజిటివ్ రివ్యూలు పడ్డాయి. సినిమా చాలా బాగుందని క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. అయితే ఓపెనింగ్స్ మాత్రం షాక్ ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో హాయ్ నాన్న ఫస్ట్ డే కేవలం రూ. 2.9 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇది నాని కెరీర్ లోయస్ట్ కావడం విశేషం. హాయ్ నాన్న డిజాస్టర్ కావడం ఖాయమని అనుకుంటుండగా… అనూహ్యంగా పుంజుకుంది.

హాయ్ నాన్న చిత్ర వసూళ్లు రోజు రోజుకూ పెరుగుతూ వచ్చాయి. ఫస్ట్ డే ఏపీ తెలంగాణాల్లో రూ. 5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 2వ రోజు రూ. 4 కోట్లు, 3వ రోజు రూ. 7.5 కోట్లు, 4వ రోజు ఆదివారం ఏకంగా రూ. 8 కోట్ల గ్రాస్ రాబట్టింది. సోమవారం కూడా హాయ్ నాన్న వసూళ్లు పర్లేదు అన్నట్లు ఉన్నాయి. ఈ చిత్రం రూ. 2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా ఏపీ/తెలంగాణాలలో ఐదు రోజులకు రూ. 26 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

హిందీ, తమిళ భాషల్లో హాయ్ నాన్న మూవీ పెద్దగా ప్రభావం చూపలేదు. రెండు భాషల్లో కలిపి ఐదు రోజులకు రూ. 1.2 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. అయితే యూఎస్ లో హాయ్ నాన్న దున్నేస్తుంది. క్లాస్ చిత్రాలకు అక్కడ మార్కెట్ ఉంటుంది. పైగా నాని యావరేజ్ చిత్రాలు కూడా అక్కడ వన్ మిలియన్ ఈజీగా దాటేస్తాయి. హాయ్ నాన్న కూడా వన్ మిలియన్ క్రాస్ చేసింది. $1.2 మిలియన్ వసూళ్లతో హాయ్ నాన్న సత్తా చాటుతుంది.

కేవలం యూఎస్ లో హాయ్ నాన్న రూ. 10 కోట్ల వసూళ్ళు అందుకుంది. దాంతో హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది. 5 రోజులకు హాయ్ నాన్న వరల్డ్ వైడ్ రూ.42 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. హాయ్ నాన్న లాభాల్లోకి రావాలంటే రూ. 30 కోట్ల షేర్, రూ. 58 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. ట్రెండ్ చూస్తుంటే ఈజీగానే అధిగమించేలా ఉంది. హాయ్ నాన్న చిత్రానికి శౌర్యువ్ దర్శకుడు. నానికి జంటగా మృణాల్ ఠాకూర్ నటించింది.