China Spy Ship in Sri Lanka: భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. దేశం స్వాతంత్ర ఉత్సవాల్లో మునిగి పోయి ఉండగా, డ్రాగన్ దేశం చైనా మాత్రం తాను అనుకున్నదే చేస్తోంది. ఇండియాపై ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో గిల్లికజ్జాలకు దిగుతోంది. భారత్‌కు చెక్ పెట్టేందుకు శ్రీలంకను ఆయుధాంగా వాడుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ద్వీప దేశం తీవ్ర అప్పుల్లో కూరుకు పోయి.. చెల్లించలేని స్థితిలో ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని చైనా భారత్‌పై ఆధిపత్యానికి లంకను పావుగా వాడుకోవాలనుకుంటోంది. అప్పులు చెల్లించమంటూ ఒత్తిళ్లకు దిగుతోంది. ఈ తరుణంలో భారత్‌పై మరింత నిఘా పెంచేందుకు ఏకంగా తన దేశానికి చెందిన స్పై(నిఘా లేదా గూఢచారి) నౌకను శ్రీలంకకు పంపించింది.
శ్రీలంకకు భారత్ వార్నింగ్..
చైనా నిఘా నౌకను శ్రీలంకలోకి రానివొద్దని భారత్ తీవ్ర తీవ్ర అభ్యంతర పెట్టింది. ఈ మేరకు శ్రీలంకకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. చైనాకు రుణాలు చెల్లించలేక హంబన్‌తోటా నౌకాశ్రయాన్ని 99 ఏళ్ల లీజుకు ఇచ్చిన క్రమంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పోర్టును మిలిటరీ అవసరాల కోసం ఉపయోగించే ప్రమాదం ఉందని ముందు నుంచే హెచ్చరిస్తోంది భారత్. అయినా ఫలితం లేకుండా పోయింది. చైనా ఒత్తిళ్లకే శ్రీలంక తలొగ్గింది. భారత్ అభ్యంతరాలను బేఖాతర్ చేసింది. నిఘా నౌక ఎంచక్కా ఓడరేవులోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో చైనా పంతం నెగ్గించుకుంది.
Also Read: Nuclear War: అణుయుద్ధం ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా? ఎంత మంది మరణిస్తారంటే?
మన అభ్యంతరాలివే..
మంగళవారం ఉదయం శ్రీలంకలోని హంబన్ టోటా ఓడ రేవులో చైనా నౌక యువాన్ వాంగ్ 5 కొలువు తీరింది. చైనా నిఘానౌక మన పొరుగు దేశంలోకి రావడానికి కేంద్రం అభ్యంతరం చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి.
– ఉపగ్రహాలు, ఖండాంతర క్షిపణులను ట్రాక్ చేయగల సామర్థ్యం ఈ నౌకకు ఉంది. చైనా నిఘా నౌకకు చెందిన ట్రాకింగ్ సిస్టమ్‌లు భారతీయ ఇన్‌స్టా లేన్‌లను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.
– ప్రధానంగా గత కొంత కాలంగా భారత, చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్రాగన్ చైనా ప్రతీదానికి కయ్యానికి కాలు దువ్వుతోంది. శ్రీలంకను అడ్డం పెట్టుకుని చైనా భారత్ ను టార్గెట్ చేస్తోంది.
– పేరుకు నౌక అయినప్పటికీ గూఢచర్యం చేసేందుకే ఇక్కడ మోహరిస్తోందంటూ ఆందోళన చెందుతోంది భారత్.
– భారత్ కు చెందిన బాలిస్టిక్ క్షిపణులను పరీక్షిస్తే వాటిని ట్రాక్ చేయగల సెన్సార్లు యుయాంగ్ వాంగ్ 5 నౌకలో ఉన్నాయి. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపంలో భారత్ తన క్షిపణులను పరీక్షంచింది.
– ఓడకు సంబంధించి అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలను కలిగి ఉంది. భారత క్షిపణుల పరిధి, ఖచ్చితత్వాన్ని పరీక్షిస్తే అంచనా వేయగల స్థితిలో ఉంటుంది.
– హిందూ మహాసముద్రంలో జలాంతర్గామి కార్యకలాపాలను సులభతరం చేసే సముద్ర సర్వేలను కూడా ఇది చేపడతుందని అనుమానం.
– దీనిపై భారత ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కాగా, ఎలాంటి నిఘా కార్యక్రమాలు చేపట్ట కూడదనే షరతు మీదనే చైనా నౌకకు పర్మిషన్ ఇచ్చినట్లు శ్రీలంక ప్రభుత్వం భారత్‌కు వివరణ ఇచ్చుకుంది. 2014లో చైనాకు చెందిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన నౌకను ఓ పోర్టులోకి శ్రీలంక అనుమతించింది. దాంతో భారత్-శ్రీలంక మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, ఈసారి చైనా నౌక ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఆన్ చేసి ఉంటుందని, శాస్త్రపరమైన పరిశోధనలు చేసేందుకు అనుమతించటం లేదని శ్రీలంక పేర్కొంది. హంబన్‌తోటా నౌకాశ్రయం కార్యకలాపాలను చైనా సంస్థ నిర్వహిస్తున్నప్పటికీ ఆపరేషనల్ సమస్యలను తామే చూసుకుంటున్నట్లు శ్రీలంక పోర్ట్స్ అథారిటీ తెలిపింది.
Also Read:Rupee Journey: 75 ఏళ్ల స్వాతంత్య్రం.. 75 రూపాయలు పతనం.. రూ.4 నుంచి రూ.80 వరకు రూపాయి ప్రయాణం!