https://oktelugu.com/

Lord Krishna House: బయటపడ్డ ఐదు వేల ఏళ్లనాటి శ్రీకృష్ణుడి ఇల్లు..

Lord Krishna House: మన హిందూ మతంలో శ్రీకృష్ణుడికి ఉన్న స్థానం తెలిసిందే. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతలో అర్జునిడికి తనదైన శైలిలో భక్తులను ఆకట్టుకున్న మహాదేవుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి జన్మస్థానం ద్వారక అని తెలుసుకున్నాం. శ్రీకృష్ణుడు, బలరాముడు నడయాడిన స్థలంగా ఉత్తరప్రదేశ్ నుంచి మధుర నుంి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందు భవన్. దీన్ని చౌరాసిక్ కంబా దేవాలయంగా పిలుస్తున్నారు. శ్రీకృష్ణుడు చిన్ననాడు ఇక్కడే గడిపాడని భక్తులు నమ్ముతారు. నందు భవన్ 24 స్తంభాలపై […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 16, 2022 / 06:10 PM IST
    Follow us on

    Lord Krishna House: మన హిందూ మతంలో శ్రీకృష్ణుడికి ఉన్న స్థానం తెలిసిందే. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతలో అర్జునిడికి తనదైన శైలిలో భక్తులను ఆకట్టుకున్న మహాదేవుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి జన్మస్థానం ద్వారక అని తెలుసుకున్నాం. శ్రీకృష్ణుడు, బలరాముడు నడయాడిన స్థలంగా ఉత్తరప్రదేశ్ నుంచి మధుర నుంి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందు భవన్. దీన్ని చౌరాసిక్ కంబా దేవాలయంగా పిలుస్తున్నారు. శ్రీకృష్ణుడు చిన్ననాడు ఇక్కడే గడిపాడని భక్తులు నమ్ముతారు. నందు భవన్ 24 స్తంభాలపై నిర్మించిన కట్టడం కావడంతో దాని నిర్మాణం ఆకర్షణీయంగా కనిపిస్తోంది. శ్రీకృష్ణుడు నడయాడిన నేల కావడంతో భక్తులు పెద్దమొత్తంలో ఇక్కడికి రావడం తెలిసిందే.

    Lord Krishna House

    ఆలయ నిర్మాణంలో ఎన్నో పద్ధతులు పాటించినట్లు తెలుస్తోంది. 24 స్తంభాలతో నిర్మించిన ఈ దేవాలయానికి వాడిన రాతి స్తంభాలు అత్యంత అందంగా చెక్కబడ్డాయి. ఆలయ నిర్మాణంపై పలు చర్చలు వస్తున్నాయి. ఆలయ నిర్మాణంలో చూపిన వైవిధ్యంపై అందరిలో ఆసక్తి కలుగుతోంది. 84 లక్షల జీవరాశుల పుట్టుకకు కారణంగా ఆలయాన్ని యోనిగా భావిస్తారు. అందుకే ఈ ఆలయం విశిష్టత గురించి సనాతన ధర్మం చెబుతోంది. దీంతో ఈ ఆలయ నిర్మాణంపై భక్తులకు ఎంతో నమ్మకం ఏర్పడింది.

    Also Read: Lokesh Kanagaraj- Prashanth Neel: వీళ్ళ సినిమాలే ఒక యూనివర్స్

    దాదాపు ఐదు వేల ఏళ్లకు చెందిన ఆలయంగా దీన్ని పేర్కొంటుంటారు. ఇక్కడ వందలాది ఆవులను సేవిస్తుంటారు. వాటిని పూజిస్తుంటారు. వాటి ఆలనాపాలన చూసుకోవడం వారి కర్తవ్యంగా భావిస్తుంటారు. ఈ ఆలయంలో యోగమయాదేవి దర్శనం దొరుకుతుంది. భక్తులకు కోరిన కోరికలు తీర్చే దేవతగా యోగమయా దేవి అభివర్ణిస్తుంటారు. శ్రీకృష్ణుడు, బలరాముడు ఇక్కడ ఆటలు ఆడుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. దీంతో శ్రీకృష్ణుడు, బలరాముడు తిరిగిన నేల కావడంతో అక్కడ భక్తులు ఎంతో విశ్వాసంతో పూజలు చేస్తుంటారని తెలిసిందే.

    Lord Krishna House

    శ్రీకృష్ణుడి నివాసం ఉన్న ఇల్లుగా భావించి భక్తులు అనేక పూజలు చేస్తున్నారు. అంత పురాతనమైన దేవాలయంగా గుర్తించబడిన చోట శ్రీకృష్ణుడు నడయాడాడని భక్తుల విశ్వాసానికి ఎన్నో ఆధారాలు లభించడంతో భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. పూజలు చేస్తూ శ్రీకృష్ణుడి ప్రసన్నం కోసం నిత్యం పూజలందుకుంటున్నాడు శ్రీకృష్ణుడు. అయోధ్య రాముడికి ద్వారక శ్రీకృష్ణుడి జన్మస్తానంగా చెబుతున్నా ఇక్కడ శ్రీకృష్ణుడు తిరిగాడని చెబుతూ భక్తులు చేస్తున్న సేవలను అందరు స్వాగతిస్తున్నారు.

    Also Read:Nikhil Karthikeya 2: కృష్ణుడు అవతారం చాలించాకా ఏమైంది

    Tags