Homeఅంతర్జాతీయంXi Jinping: హిట్లర్,సద్దాం హుస్సేన్, ముషారప్.. ఇప్పుడు జిన్ పింగ్

Xi Jinping: హిట్లర్,సద్దాం హుస్సేన్, ముషారప్.. ఇప్పుడు జిన్ పింగ్

Xi Jinping: అధికారం శాశ్వతం అని కలలుగనే వారికి చెంప చెల్లమనిపించే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఉద్వానసనకు గురయ్యారన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. రాజ్యాంగ సవరణ చేసుకుని తనకు తాను శాశ్వత అధ్యక్షుడిగా ఉన్న జిన్ పింగ్ ఇప్పుడు హౌస్ అరెస్ట్ అయ్యారన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా వెల్లడి కానున్నా… చైనా నుంచి వచ్చే విమానాలు పెద్ద ఎత్తున రద్దు కావడం, చైనా బలగాలు భారీ మోహరించడంతో అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. తనకు తాను శక్తిమంతుడిగా ప్రకటించుకున్న జిన్ పింగ్ కే పతనం తప్పలేదన్న మాట. అధికారం శాశ్వతమని ఇష్టారాజ్యంగా ప్రవర్తించే వారికి ఎక్కడో చుక్కెదురుగాక తప్పదు. హిట్లర్ నుంచి సద్దాం హుస్సేన్ వరకూ..ముషారఫ్ వంటి వారికి ఈ గుణపాఠాలు తప్పలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎగిరిపడ్డారు. చివరకు పాతాళానికి దిగబడ్డారు. జైలు ఉచలు లెక్కెట్టిన వారూ ఉన్నారు. తనకు ఎదురే లేదని ఎగిరిపడిన జిన్ పింగ్ పరిస్థితి చివరకు తారుమారైంది.

Xi Jinping
Xi Jinping

వాస్తవానికి చైనాలో మరో పార్టీ ఉండదు. చర్యలు తీసుకోవడానికి ఎన్నికల సంఘం ఉండదు. సొంత పార్టీ వారు ఎదురుతిరిగితే మరణ శిక్ష విధిస్తారు.ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వేలా కోట్ల అధిపతి అయినా ఇట్టే కూల్చేస్తారు. జాక్ మా ఉదాంతమే ఇందుకు ఉదాహరణ. తనకు ప్రత్యర్థులైన ఇద్దరు మాజీ మంత్రులకు జిన్ పింగ్ మరణ శిక్ష విధించారు. వారు చేసిన తప్పు అవినీతి. కానీ ఇటీవల జిన్ పింగ్ పై కూడా అవినీతి మచ్చ వచ్చింది. విపరీతమైన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీపీ) స్పందించింది. పిపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చీఫ్ పదవి నుంచి తొలగించింది. అంతటితో ఆగకుండా ప్రస్తుతం ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే చైనాలో ఏం జరుగుతుందో బయటు తెలియదు కానీ.. ఏదో మాత్రం జరుగుతోందని ప్రపంచం నమ్ముతోంది.

Xi Jinping
Xi Jinping

ఒకటి మాత్రం చెప్పగలం. నియంతృత్వ దేశంలోనే ఇలా ఉంటే.. ప్రజాస్వామ్య దేశంలో చెప్పనక్కర్లేదు. అక్కడ సైన్యం అవసరం రావోచ్చు ఏమో కానీ.. ప్రజాస్వామ్యంలో మాత్రం ఓటు అనే ఆయుధంతో ప్రజలు సర్వాధికారాలను పీకేస్తారు.వారు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారినే బెదిరించి.. తిరిగి ఎన్నికల్లో ఓటు వేయించుకుంటామంటే అది కుదరని పని. ప్రజలంతటి అమాయకులు కూడా కాదు. అధికారమనేది ముళ్ల కిరీటంగా భావించిన వారు కొంత భయంతో పనిచేస్తారు. అధికారం నెత్తికెక్కిన వారు ఇష్టారాజ్యంగా చెలాయిస్తారు. తీరా అధికారం నుంచి జారిపోయాక కానీ వారికి తత్వం బోధపడుతుంది. ఇందుకు జిన్ పింగే చక్కటి ఉదాహరణ.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version