Dr. Parthasarathy : వైసీపీ, టీడీపీ ఇద్దరూ బీసీ ద్రోహులే!

Dr. Parthasarathy కుప్పం.. చంద్రబాబు సొంత నియోజకవర్గం. తరాలుగా ఆయనను గెలిపిస్తూ వస్తున్న కంచుకోట అది. ఈ నియోజకవర్గం నుంచే గెలిచి చంద్రబాబు సీఎంగా రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. అయితే కుప్పంలో ఇప్పటికీ బీసీ జనాభానే ఎక్కువ. అలాంటి బీసీ నియోజకవర్గంలో అగ్రకులమైన చంద్రబాబు ఎలా పోటీచేస్తారని అక్కడి నేతలు, బీసీలు నిలదీస్తున్నారని బీజేపీ నేత డా. పార్థసారథి సూటిగా ప్రశ్నించారు. బీసీలు అత్యధికంగా ఉండే కుప్పంలో అగ్రకులమైన చంద్రబాబు పోటీచేయడం ఏంటని.. ఈ టికెట్ ను బీసీలకే […]

Written By: NARESH, Updated On : September 25, 2022 11:43 am
Follow us on

Dr. Parthasarathy కుప్పం.. చంద్రబాబు సొంత నియోజకవర్గం. తరాలుగా ఆయనను గెలిపిస్తూ వస్తున్న కంచుకోట అది. ఈ నియోజకవర్గం నుంచే గెలిచి చంద్రబాబు సీఎంగా రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. అయితే కుప్పంలో ఇప్పటికీ బీసీ జనాభానే ఎక్కువ. అలాంటి బీసీ నియోజకవర్గంలో అగ్రకులమైన చంద్రబాబు ఎలా పోటీచేస్తారని అక్కడి నేతలు, బీసీలు నిలదీస్తున్నారని బీజేపీ నేత డా. పార్థసారథి సూటిగా ప్రశ్నించారు. బీసీలు అత్యధికంగా ఉండే కుప్పంలో అగ్రకులమైన చంద్రబాబు పోటీచేయడం ఏంటని.. ఈ టికెట్ ను బీసీలకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా తక్కువ తినలేదని పార్థసారథి విమర్శించారు. బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ బీసీలకు జగన్ టికెట్లు ఇవ్వలేదంటూ ఉదాహరణలతో సహా వివరించాడు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఆరింటిలో బీసీలు అత్యధికంగా ఉంటే.. ఒక్కరంటే ఒక్క బీసీలకు కూడా సీటు ఇవ్వలేదని.. అందరూ రెడ్డీలకే జగన్ ఇచ్చాడని.. ఇదేనా బీసీ సంక్షేమం అని నిలదీశారు.

రాష్ట్రవ్యాప్తంగా 55 శాతం ఉన్న బీసీలకు జగన్ ఎన్ని సీట్లు ఇచ్చాడని పార్థసారథి ప్రశ్నించారు. అటు తెలుగుదేశం కూడా సీట్లు ఇవ్వలేదని..టీడీపీ, వైసీపీ రెండు పార్టీ కూడా బీసీ ద్రోహులేనని.. అన్యాయం చేశాయని ఆరోపించారు.

నాడు ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్ ను బీసీలకు ఇచ్చి వారికి పదవులు దక్కేలా చేశాడని.. అందుకే ఇప్పటికీ బీసీలు ఎన్టీఆర్ ను తలుచుకుంటారని పార్థసారథి చెప్పుకొచ్చాడు. కానీ తర్వాత వచ్చిన చంద్రబాబు, జగన్ లు ఈ రిజర్వేషన్ ను అమలు చేయకపోవడంతో బీసీలు అన్యాయమైపోతున్నారన్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో 1500 మంది బీసీలకు పదవులు దక్కకుండా జగన్ ప్రభుత్వం చేసిన తీరు దారుణమని విమర్శించారు. చంద్రబాబు వంతపాడుతూ బీసీలకు ఈ ఇద్దరూ అన్యాయం చేస్తున్నారని పార్థసారథి నిప్పులు చెరిగారు.