Analysis On Telangana Liberation Day History ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ లేరు. ఆయన చేసే విశ్లేషణల్లో చరిత్రను వక్రీకరిస్తున్నారు. అందుకే ఈ ప్రతిస్పందన.. తెలంగాణ చరిత్రపై నాగేశ్వర్ చెప్పిన మాటలు సమర్థించుకోవడానికి నిజాలను కప్పిపుచ్చాడని అర్థమవుతోంది.

ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినది ఏంటంటే.. ‘నిజాం లొంగిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టే.. సర్ధార్ వల్లభాయ్ పటేల్ ద్వారా ఆయన లొంగిపోయారు’ అని నాగేశ్వర్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అసలు చెప్పే పద్ధతి ఏంటి? చివరి క్షణం దాకా స్వతంత్ర్య దేశంగా తపనపడ్డ నిజాం.. ఎన్నో కుట్రలు చేశాడు. భారతదేశం ఎన్నో అవకాశాలు ఇచ్చినా కూడా ఉపయోగించుకోలేదు. తప్పని పరిస్థితుల్లో భారత సైన్యాన్ని దించి నిజాం రాజును లొంగదీసుకున్నాడు.
అంతేకానీ నిజాం లొంగిపోయే పరిస్థితి ఉందని.. ఒప్పందం చేసుకొని లొంగిపోయాడా? నాలుగు రోజులు ‘ఆపరేషన్ పోలో’ పేరిట ఐదు దిక్కుల నుంచి దిగ్బంధం చేస్తే.. తప్పని పరిస్థితుల్లో నిజాం లొంగిపోయాడు. కమ్యూనిస్టుల పోరాటాన్ని తక్కువ చేయవద్దు. నిజాం ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోడు. నాగేశ్వర్ మాటలు ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు.. నిజాం ఇష్టంగా లొంగిపోలేదు. కష్టంగా లొంగిపోయాడు.
తెలంగాణ ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో భారత సైన్యంతో పోరాడారు’ అన్న నాగేశ్వర్ స్టేట్ మెంట్ కూడా పెద్ద తప్పు. నిజాంకు వ్యతిరేకంగానే తెలంగాణ ప్రజలు పోరాడారు. భారత సైన్యంతో కలిసి రజాకర్లపై దాడులకు దిగారు. తెలంగాణ కమ్యూనిస్టు నాయకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోనే భారత సైన్యంతో తెలంగాణ ప్రజలు పోరాడాల్సి వచ్చింది.
తెలంగాణ విమోచన చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కు కౌంటర్ గా ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
వీడియో
