ఏడాదిలో 50 వేల కోట్ల భారం వేసిన వైసీపీ ప్రభుత్వం

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రజలపై రూ.50వేల కోట్ల భారాలు వేశారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇసుక ధర, ఆర్టీసి ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ రేట్లు అన్ని పెంచారని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఆర్ధిక సాయం అందించడానికి ప్రభుత్వానికి మనసు రాలేదన్నారు. కరెంటు కొరత, కరెంటు కోతలు అనేమాట లేకుండా చేశానని, జెన్ కో, ట్రాన్స్ కో పటిష్టం చేశానని చెప్పారు. విద్యుత్ […]

Written By: Neelambaram, Updated On : May 21, 2020 12:18 pm
Follow us on

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రజలపై రూ.50వేల కోట్ల భారాలు వేశారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇసుక ధర, ఆర్టీసి ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ రేట్లు అన్ని పెంచారని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఆర్ధిక సాయం అందించడానికి ప్రభుత్వానికి మనసు రాలేదన్నారు. కరెంటు కొరత, కరెంటు కోతలు అనేమాట లేకుండా చేశానని, జెన్ కో, ట్రాన్స్ కో పటిష్టం చేశానని చెప్పారు. విద్యుత్ ఉత్పాదక సామర్ధ్యం 9,529 మెగావాట్ల నుంచి 19,680 మెగావాట్లకు పెంచామన్నారు. ఐదు ఏళ్లు కరెంట్ ఛార్జీలు పెంచలేదని, భవిష్యత్ లో కూడా పెంచేది లేదని చెప్పామన్నారు. తగ్గిస్తామని హామీ ఇచ్చామని,సమర్ధత పెంచుకుంటామని స్థానికంగా జనరేషన్ చేసేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. పిపిఏల రద్దు మంచిదికాదని అనేకమంది ఎన్నోమార్లు చెప్పినా వైసిపి ప్రభుత్వం వినలేదని, జపాన్ రాయబారి, కేంద్ర ఆర్దిక మంత్రి, ఇంధన శాఖ మంత్రి చెప్పినా వినే పరిస్థితి లేదన్నారు. దేశంలో ఎక్కడా పెట్టుబడులు పెట్టలేమని, ఏపిలో ఇష్ట ప్రకారం చేస్తున్నారని అంతర్జాతీయ కంపెనీలు హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు.

పిపిఏలపై అప్పిలేట్ ట్రిబ్యునల్ చెప్పినా హైకోర్టు చెప్పినా వినలేదని, చివరికి హైకోర్టు కలుగజేసుకుని వార్నింగ్ ఇచ్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ‘ఏ’ లో ఉన్నవాళు ‘బి’ లోకి వస్తే రూ.1.45 బదులు రూ 2.60 కట్టాల్సి వచ్చిందని, బి నుంచి సి కి వస్తే రూ 3. 35 కట్టేవాళ్లు ఇప్పడు యూనిట్ కు రూ 3.60 నుంచి 5.60కు పెరుగుతుందని చెప్పారు. 301-400 యూనిట్లు ఉంటే రూ 7.95, అదే 401-500 ఉంటే రూ 8.50పైసలు, 500కంటె ఎక్కువ ఉంటే రూ 9.95 వసూలు చేస్తున్నారని దీనితో విపరీతంగా బిల్లులు పెరిగి పోయాయని తెలిపారు. ఫ్యాన్ కు ఓటేసిన వాళ్ల ఇళ్లలో కూడా ఇప్పుడు ఇళ్లలో ఫ్యాన్ తిరగని పరిస్థితి తెచ్చారన్నారు. మద్యం రేట్ల పెంపు ద్వారానే రూ.30వేల కోట్ల ఆదాయం వస్తోందని, మీ డబ్బుల కక్కుర్తి కోసం నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్మించి పేదల ఆరోగ్యం దెబ్బతీస్తున్నారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ప్యాకేజిలో డిస్కంల నష్టాల భర్తీకి వేల కోట్లు ఇస్తామని ముందు కొచ్చారు. ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితి పెంపు వల్ల రూ.50వేల కోట్ల వెసులుబాటు వస్తుందన్నారు. రాబోయే కాలంలో కరోనా రానివారు ఎవరూ ఉండరని అంటారా. అంటే అందరికీ కరోనా రప్పించాలని అనుకుంటున్నారా మీరు అని ప్రశ్నించారు. క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయండని, రాష్ట్రానికి వచ్చినవాళ్లను అక్కడ పెట్టండి, కంటైన్ మెంట్ జోన్లు పెట్టమని ముందే కోరితే నిర్లక్ష్యం చేశారన్నారు. వైసిపి నాయకులు వెళ్తే లాక్ డౌన్ ఉండదని, టిడిపి నాయకులు, ప్రతిపక్షాలు మాత్రం వెళ్లకూడదు లాక్ డౌన్ ఉందంటారని చెప్పారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపై బూతులతో విరుచుకుపడతారా ఫోన్లు చేసి వాళ్లను బెదిరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ తరపున వెబ్ సైట్ కూడా పెడుతున్నామని, ఎక్కువ కరెంటు బిల్లులు వచ్చిన వారంతా వాటిని పంపాలని, సోషల్ మీడియాలో షేర్ చేసి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. తప్పులు చేసు ప్రజల ముందు అపహాస్య పాలు అవుతున్నారని తెలిపారు. పోలీసులు కరోనా కట్టడికి పాటుపడ్డారని, ముఖ్యమంత్రి తిక్క సమాచారంతో ఒక్కరోజులో మద్యం దుకాణాలు తెరిచి వాళ్ల శ్రమ వృదా చేశారన్నారు. బిల్డ్ ఏపి కాదు సోల్డ్ ఏపిగా రాష్ట్రాన్ని చేశారని, లాక్ డౌన్ పీరియడ్ లో కరెంటు బిల్లులు మాఫీ చేయాలన్నారు. పాత శ్లాబుల విధానమే కొనసాగించాలని కోరారు. చేతనైతే విద్యుత్ బిల్లులు తగ్గించమని సూచించారు. ఆరోజు మీ మేనిఫెస్టోలో పెంచమని చెప్పారని గుర్తు చేశారు. తగ్గిస్తామని ప్రమాణ స్వీకారం రోజున ప్రకటించారన్నారు. రాయలసీమకు నీళ్లిచ్చిందెవరు, పట్టిసీమ పూర్తి చేసిందెవరు,నదుల అనుసందానం చేపట్టింది ఎవరు, పట్టిసీమ ద్వారా నదులు అనుసందానం చేసి గోదావరి నీటిని కృష్ణా ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి, శ్రీశైలం నుంచి రాయలసీమకు టిడిపి ప్రభుత్వం నీళ్లిచ్చిందని తెలిపారు. గండికోటలో పరిహారం చెల్లించి 12టిఎంసిలు నిలబెట్టామని, అందులో 25టిఎంసిలు నిలబెట్టవచ్చు ఎందుకు నిలబెట్టలేక పోయారని ప్రశ్నించారు. రాష్ట్రం హక్కులు కాపాడుకోడానికి మనం సిద్దంగా ఉండాలని, అంతే తప్పమిగులు జలాలపై హక్కు వదులుకుంటూ వైఎస్సార్ రాసిన లేఖ వల్లే ఏపికి కష్టాలని చెప్పారు. కరెంటు ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ నేడు మండల, నియోజకవర్గ స్థాయిలో టిడిపి నాయకులు నిరసన దీక్షలు చేస్తారని చెప్పారు.