https://oktelugu.com/

ఫలించని బాబు వ్యూహం..!

అమరావతి నుంచి రాజధానిని తరలించకుండా అడ్డుకునేందుకు, వైసీపీ ప్రభుత్వం టిడిపి నాయకులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడితే రక్షణ పొందేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో వ్యూహాలు పన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం తనకు అధికారం లేదు కాబట్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సాయం కోసం తన పార్టీ ఎంపీలను బీజేపీలోకి పంపించడం ఈ వ్యూహాల్లో ఒకటి. Also Read: సైకిల్ గాలిపోతుంటే అక్కడేం చేస్తున్నావ్ బాబు..? ఎన్నికల ముందు బీజేపీ, ప్రధాని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 8, 2020 12:50 pm
    Follow us on

    Chandrababu
    అమరావతి నుంచి రాజధానిని తరలించకుండా అడ్డుకునేందుకు, వైసీపీ ప్రభుత్వం టిడిపి నాయకులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడితే రక్షణ పొందేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో వ్యూహాలు పన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం తనకు అధికారం లేదు కాబట్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సాయం కోసం తన పార్టీ ఎంపీలను బీజేపీలోకి పంపించడం ఈ వ్యూహాల్లో ఒకటి.

    Also Read: సైకిల్ గాలిపోతుంటే అక్కడేం చేస్తున్నావ్ బాబు..?

    ఎన్నికల ముందు బీజేపీ, ప్రధాని మోడీపై తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తీవ్రమైన విమర్శలను చేశారు. దీంతో బీజేపీ, ప్రధాని మోడీతో సంబందాలు కోల్పోయిన బాబు బీజేపీలోకి తన ఎంపీలను పంపించడంతో సత్సంబందాలు మళ్లి నెలకొంటాయని భావించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యూహం ప్రకారం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా టిడిపి రాజ్యసభ సభ్యులు సుజన చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి మోహనరావులు టిడిపిలో పదవులు పొంది బిజెపిలో చేరారు. పార్టీని వెళ్లిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని టిడిపి నాయకులు రకరకాల ప్రకటనలు చేసినా చివరికి అవి ఉత్తుత్తి ప్రకటనలుగా మిగిలిపోయాయి.

    ఇక్కడి వరకూ చంద్రబాబు అనుకున్న విధంగానే సాగింది. బీజేపీలో చేరిన ఎంపీలు మాత్రం వారి లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయారు. బీజేపీని టిడిపికి దగ్గర చేసే పనిలో, అమరావతి నుంచి రాజధానిని తరలించకుండా అడ్డుకోవడంలో, టిడిపి నాయకులపై వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలను అడ్డుకోవడంలో ఆశించిన ఫలితాలు చంద్రబాబుకు దక్కలేదు. దీంతో ఈ విషయంలో చంద్రబాబు వ్యూహం విఫలమయినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    Also Read: ఆంధ్రలో బిజెపి-జనసేన కూటమికి పవన్ కళ్యాణ్ నాయకత్వం?

    బీజేపీలో చేరిన సుజనా చౌదరికి, సిఎం రమేష్, టి.జి వెంకటేష్, గరికపాటి మోహనరావులకు బీజేపీ నాయకులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ తక్కువగా ఉందికాబట్టీ పార్టీలో చేరతామని వచ్చిన వారిని వెంటనే చేర్చుకున్నప్పటికీ ఆ తరువాత జాతీయ నాయకత్వం వీరిని పెద్దగా పట్టించుకోకుండా పక్కన పెట్టింది. ఆ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు సుజనా చౌదరి అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని, ఏదో చేసేస్తుందని రాజధాని రైతులను మభ్యపెడుతూ వచ్చారు. ఇటీవల హై కోర్టులో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ పిటీషన్ లో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయడంతో ఇప్పడు ఈ విషయం చర్చనీయంగా మారింది. టిడిపి నుంచి బీజేపీలోకి నలుగురు ఎంపీలను పంపిన చంద్రబాబుకు వ్రతం చెడినా ఫలితం దక్కకుండా పోయింది.