బాబు ప్రెస్ మీటా..? టీడీపీ నేతల పరుగో పరుగు?

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే ప్రజలే కాదు.. ఇప్పుడు సొంత టీడీపీ నాయకులు, కార్యకర్తలు , డైహార్ట్ మద్దతుదారులు కూడా పరుగో పరుగు అని పారిపోతున్నారట.. వెంటనే బాబుతో పాటు ఉండకుండా బయటకు పోవడమో చేస్తున్నారట.. ఇక టీవీలోనూ లైవ్ వస్తే వేరే చానెల్ మార్చేస్తున్నారట.. దీనికంతటికి చంద్రబాబు ఊదరగొట్టే.. నసపెట్టే సుధీర్ఘ ప్రసంగాలే కారణమని వారంతా దూరం జరుగుతున్నారట.. చంద్రబాబు మాటల ప్రవాహం తప్పితే పెద్దగా ఏమీ సాధించేది ఉండదన్నది టీడీపీ వర్గాల […]

Written By: NARESH, Updated On : August 8, 2020 12:50 pm
Follow us on


టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే ప్రజలే కాదు.. ఇప్పుడు సొంత టీడీపీ నాయకులు, కార్యకర్తలు , డైహార్ట్ మద్దతుదారులు కూడా పరుగో పరుగు అని పారిపోతున్నారట.. వెంటనే బాబుతో పాటు ఉండకుండా బయటకు పోవడమో చేస్తున్నారట.. ఇక టీవీలోనూ లైవ్ వస్తే వేరే చానెల్ మార్చేస్తున్నారట.. దీనికంతటికి చంద్రబాబు ఊదరగొట్టే.. నసపెట్టే సుధీర్ఘ ప్రసంగాలే కారణమని వారంతా దూరం జరుగుతున్నారట.. చంద్రబాబు మాటల ప్రవాహం తప్పితే పెద్దగా ఏమీ సాధించేది ఉండదన్నది టీడీపీ వర్గాల వాదన .. చంద్రబాబు ఆవేదన, ఆగ్రహం తప్ప ఏమీ సాధించలేడు అని వారంతా అనుకుంటున్నారు.

Also Read: ఫలించని బాబు వ్యూహం..!

చంద్రబాబు అమరావతి కోసం పోరాడుదామని పిలుపునివ్వగానే పెద్దగా స్పందన రావడం లేదు. అమరావతి కోసం పోరాడలేమని పలువురు టీడీపీ సీనియర్ నాయకులు డిసైడ్ అయ్యారట.. ఇక రోడ్లపైకి రాకుండా ఆందోళనలు చేయకుండా ప్రెస్ మీట్లతోనే నిరసన తెలుపుదామని మరికొందరు భావిస్తున్నారట..

చాలా మంది టీడీపీని నమ్ముకొని విలువలతో బతికే నాయకులు చంద్రబాబు ఆదేశానికి మౌనంగా ఏం చేయాలో పాలుపోక అసహనం వెళ్లగక్కుతున్నారట.. కొందరేమో కక్కలేక మింగలేక ఉంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒక అడుగు ముందుకేసి కేవలం మీడియా సమావేశాల ద్వారా ఏమీ సాధించలేరని ఖరాఖండీగా కుండబద్దలు కొట్టారు.చంద్రబాబు, లోకేష్ జూమ్ యాప్ లో కాకుండా వీధుల్లోకి వచ్చి ఫైట్ చేయాలని స్పష్టం చేశాడు. మీడియా సమావేశాలతో ఏమీ సాధించలేరని దెప్పిపొడిచాడు. చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా కేశినేని ట్వీట్ చేసినట్టు అర్థమవుతోంది.

Also Read: సైకిల్ గాలిపోతుంటే అక్కడేం చేస్తున్నావ్ బాబు..?

కేశినేని నాని గతంలో కూడా తన కంటే తక్కువ వయస్సు ఉన్న.. అనుభవం ఉన్న ఎంపీలకు పార్టీ పార్లమెంటరీ నాయకత్వాన్ని చంద్రబాబు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపై ఆయన చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు కూడా లేవనెత్తారు. నాని గత కొన్ని నెలలుగా తక్కువ ప్రొఫైల్‌ను పాటిస్తున్నారు. టిడిపి ఫైట్ మోడ్‌లోకి రావాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జూమ్ లోనే ఉద్యమాలకు పిలుపునివ్వడాన్ని అందరిలా ఆయన సహించక ఓపెన్ గానే బాబుకు సవాల్ చేసేశారు.