YCP vs Chandrababu : శత్రువుకు శత్రువు మిత్రుడంటారు.. ప్రత్యర్థివర్గంలో అసంతృప్తివాదులు, నాయకత్వంతో విభేదించేవారిని సైతం స్నేహితులుగానే పరిగణిస్తారు. ఇప్పుడు చంద్రబాబు అదే చేస్తున్నారు. వైసీపీ ధిక్కార స్వరాలకు సైతం అభయమిస్తున్నారు. నేనున్నాను.. నేను చూసుకుంటాను ప్రొసీడ్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఎంతమంది ఎక్కువగా మాట్లాడితే అంతలా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని భావిస్తున్న చంద్రబాబు తన అసలు సిసలు రాజకీయాన్ని మొదలు పెట్టేశారు. టీడీపీ రూపంలో మీకు ఒక ఆప్షన్ ఉందని వైసీపీ ధిక్కార స్వరాలకు ఆశ కల్పిస్తున్నారు. వారి వాయిస్ ను మరింత రేజ్ అయ్యేలా ప్రామ్టింగ్, ప్రోత్సాహం రెండూ ఇస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు మీడియా సమావేశంలో పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంచివాళ్లకు పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు. మంచివాళ్లు అంటే తప్పకుండా జగన్ తో విభేదించిన వారే. జగన్ పై విమర్శలు చేసి..వైసీపీని ధిక్కరించే వారే మంచివాళ్ల అని టీడీపీ ఎప్పటి నుంచో ట్రీట్ చేస్తోంది.

వైసీపీ ఆవిర్భావం నుంచి ఆదరిస్తున్న నెల్లూరులో ఇటీవల ధిక్కార స్వరాలు పెరిగాయి. కొందరు బాహటంగానే ప్రభుత్వాన్ని, పార్టీ అధినేత తీరును విభేదించి మాట్లాడుతున్నారు. మరికొందరు టైమ్ కోసం వేచిచూస్తున్నారు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలకు టైమ్ వచ్చినట్టుంది. అందుకే జగన్ తీరుకు వ్యతిరేకంగా గట్టిగానే మాట్లాడేస్తున్నారు. ఇప్పటికిప్పుడువారిపై చర్యలకు వైసీపీ వెనుకడుగు వేస్తోంది. కానీ వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు దక్కే చాన్స్ లేదు. అందుకే చంద్రబాబు ఇప్పుడు వారికి కొత్త సంకేతాలు పంపుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంతలా ఆరోపణలు చేస్తే.. అంత ప్రజావ్యతిరేకత పెల్లుబికుతుందని భావిస్తున్న చంద్రబాబు ‘మంచివాళ్లు’ అని సంభోదించి మరీ వారికి తన ఆశిస్సులు అందిస్తున్నారు.
దాదాపు 100 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. అందులోటిక్కట్లు రావని భావిస్తున్నవారు.. టిక్కెట్లు ఇచ్చినా ఇంతటి ప్రజాగ్రహం ముందు గెలవలేమని అనుకుంటున్నవారు టీడీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది టీడీపీ హైకమాండ్ కు టచ్ లో ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అయితే వారితో ఓ పద్ధతి ప్రకారం ప్రభుత్వంపై విమర్శలు చేయించాలని.. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడించాలని చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది. అయితే ముందస్తు ఎన్నికలు అన్న కాన్సెప్ట్ వస్తే మాత్రం చాలా వైసీపీలో ధిక్కార స్వరాలు ఇప్పటికప్పుడు బయటపడే అవకాశముంది. అదే షెడ్యూల్ ప్రకారం జరిగితే మాత్రం వంతులు పంచుకొని మరీ జగన్ తో పాటు వైసీపీ నాయకత్వంపై విమర్శల డోసు పెంచే అవకాశముంది. మొత్తానికైతే ధిక్కార స్వరాల వెనుక చంద్రబాబు ఉన్నారని తెలుస్తుండడం అధికార పార్టీని కలవరపరుస్తోంది.