Khushi Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచినా ‘ఖుషి’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే..స్టార్ హీరో కొత్త సినిమాకి కూడా ఈ రేంజ్ హంగామా అభిమానులు చెయ్యడం గతం లో మీరెప్పుడు కూడా చూసి ఉండరు..మొదటి ఆట నుండి చివరి ఆట వరకు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రభంజనం సృష్టించారు అభిమానులు..అలా మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి నాలుగు కోట్ల 30 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇది ఒక ఆల్ టైం సెన్సేషనల్ రికార్డు గా చెప్పుకోవచ్చు..గతం లో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా ని పుట్టినరోజు కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక షోస్ వేసుకున్నారు..ఈ షోస్ కి దాదాపుగా 3 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఈ చిత్రం తర్వాత ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యినప్పటికీ కూడా జల్సా రికార్డు ని అందుకోలేకపోయారు.
మళ్ళీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు మేము ఆ రికార్డుని బ్రేక్ చేస్తామని..మా రికార్డుని మేమె బద్దలుకొట్టుకుంటామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సవాలు చేసారు..అయితే పుట్టినరోజు వరకు కూడా ఆగకుండా అదే ఏడాదిలో జల్సా రికార్డుని భారీ మార్జిన్ తో బ్రేక్ చెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ ఎలాంటిదో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసింది ఈ చిత్రం.
ఇక రెండవ రోజు కూడా ఈ సినిమాకి అద్భుతమైన హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి..ముఖ్యంగా నైజాం ప్రాంతం లో రెండవ రోజు ఈ చిత్రం దాదాపుగా 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..అలా రెండవ రోజు అన్ని షోస్ కి కలిపి దాదాపుగా కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చి ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు..రెండు రోజులకు కలిపి ఆరు కోట్ల రూపాయిల గ్రాస్ కి దగ్గర్లో వచ్చింది ఈ చిత్రం.