Chandrababu: వార్త యందు జగతి వర్ధిల్లాలి. ఎప్పుడు, ఏమిటి, ఎందుకు, ఎవరు, ఎలా? అనే కోణాల్లో వార్త సాగాలి. పై వాటిల్లో ఏ ఒక్కటి గతి తప్పినా వార్త స్వరూపమో మారిపోతుంది. ఫలితంగా తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళుతుంది. ఒక తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్తే దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే ప్రస్తుతం రాజకీయ పార్టీలు పత్రికలు నడిపిస్తున్న నేపథ్యంలో, పత్రికలు నడిపిస్తున్న యాజమాన్యాలకు రాజకీయ అవసరాలు ఉన్న తరుణంలో.. జనంలోకి వస్తున్న వార్తల స్వరూపం చిత్ర విచిత్రంగా ఉంటోంది. ఎవరికి తోచింది వారు రాస్తుండటంతో వార్త అనేది ఒక వార్త లాగా ఉండకుండా సంచలనానికి కేంద్ర బిందువవుతున్నది.. తెలుగు నాట కొన్ని వార్తాపత్రికలు రాజకీయ పత్రికలుగాను, కుల పత్రికలు గానూ చెలామణి అవుతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆంధ్రజ్యోతి గురించి..
చంద్రబాబు అంటే చాలు
ఆంధ్రజ్యోతి పత్రిక ఓనర్ కు చంద్రబాబుకు సంబంధం ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెనకటి రోజుల్లో ఇటలీ తుమ్మితే ఫ్రాన్స్ కు జలుబు వచ్చినట్టు.. చంద్రబాబుకు ఏమైనా అయితే రాధాకృష్ణ తట్టుకోలేడు. ఆ బాధనంతా తన పేపర్లో కుమ్మరిస్తాడు. ఆ మధ్య చంద్రబాబు అరెస్టు అయితే రాధాకృష్ణ ఎలాంటి రాతలు రాశాడో అందరూ చూశారు. అలాంటి రాధాకృష్ణ చంద్రబాబును మరొకసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన పత్రికలో ఎన్నో రాతలు రాస్తున్నాడు. జగన్ మీద రకరకాల వార్తలు రాస్తున్నాడు. అలాంటి రాధాకృష్ణ పేపర్, చానెల్ ను ట్రోల్ చేస్తూ వైఎస్ఆర్సిపి కి చెందిన ఓ అభిమాని ఒక విచిత్రమైన వీడియో రూపొందించాడు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఇంతకీ ఏం చేశారంటే
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని కాస్త సిబిఎన్ ఆంధ్రజ్యోతి అని మార్చారు. న్యూస్ యాంకర్ స్థానంలో ఒక వ్యక్తిని కూర్చోబెట్టారు. అతడికి ఒక రిపోర్టర్ కాల్ చేస్తాడు. ఆ రింగ్ టోన్ లోకేష్ అన్నా..లోకేష్ అన్నా అనే పాట రూపంలో ఉంటుంది. వెంటనే ఆ ఫోన్ ఎత్తిన ఆ యాంకర్ రిపోర్టర్ తో మాట్లాడుతాడు. జగన్ అమలు చేస్తున్న పథకంలో లోపాలు వెతుకు. ఆ లోపాల ఆధారంగానే ఒక వార్త రూపొందించు. అది అబద్ధమైన పర్వాలేదు అతికినట్టు ఉండాలి. అది జనాల్లోకి బాగా వెళ్లాలి. అబద్ధాన్ని వందసార్లు నిజమని చెప్తే అది నిజమవుతుంది.. జగన్ మీద వ్యతిరేక వార్తలు ప్రసారం అవుతూ ఉండాలి అని ఆ న్యూస్ యాంకర్ ఆ రిపోర్టర్ ను ఆదేశిస్తాడు.. ఆ తర్వాత గ్లాసులో ఉన్న మందును తాగుతూ ఉంటాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జగన్ కు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్న తీరును తట్టుకోలేక వైసీపీ అభిమానులు రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియోకి సీబీఎన్ చంద్రజ్యోతి వార్తలు ఇలాగే ఉంటాయి అనే ట్యాగ్ లైన్ పెట్టడం విశేషం.
YELLOW మీడియా వార్తలు ఇలానే ఉంటాయి ! pic.twitter.com/aBujQQXOyZ
— SS (@Tate_YCP) December 6, 2023